బిగ్ బాస్ హౌజ్ లో పైసా వసూల్ ప్రమోషన్ పైసా వసూల్ ప్రమోషన్ లో పాల్గొననున్న బాలకృష్ణ ప్రమోషన్ కోసం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోకు బాలయ్య 

ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్.. తెలుగు బుల్లితెరపై మరే షో సాధించనంత రేటింగ్ సాధించి స్టార్ మా ఛానెల్ రేంజ్ ను దేశంలోనే టాప్ ఛానెల్స్ లో ఒకటిగా చేసింది. బుల్లితెరపై మొట్టమొదటి సారిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘బిగ్ బాస్’ రియాల్టీ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మొదట్లో పార్టిసిపెంట్స్ కారణంగా ఈ షో పై పెద్దగా ఇంట్రెస్ట్ కలగకపోయినా.. వీకెండ్ లో శని, ఆదివారాల్లో.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న సందడికి ఒక్కసారే టీ.ఆర్.పీ రేటింగ్ కూడా పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌజ్ నుంచి వారానికి ఒక్కరు ఎలిమినేట్ అవుతుండటం..కాస్త ఉత్కంఠ రేపుతుంది. అంతే కాదు బిగ్ బాస్ కంటెస్టంట్స్ కి ఇస్తున్న టాస్క్ లు కూడా చాలా ఫన్నీగా ఉండటంతో ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతుంది.

బిగ్ బాస్ హౌజ్ లోకి ఈ మద్య సెలబ్రెటీల ఎంట్రీ కూడా మంచి వినోదాన్ని అందిస్తుంది. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి చిత్రం ప్రమోషన్ కోసం రానా ఎంట్రీ ఇవ్వగా ఆనందో బ్రహ్మ చిత్రం కోసం తాప్సీ ఎంట్రీ ఇచ్చింది. ఇక అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ కోసం దేవరకొండ విజయ్ బిగ్ బాస్ టీమ్ తో సందడి చేశాడు. తాజాగా మరో సెన్సేషన్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

బిగ్ బాస్ హౌజ్ లోకి నందమూరి నటసింహం బాలయ్య బాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న ‘పైసా వసూల్ ’ సినిమా ప్రమోషన్ కోసం బాలకృష్ణ బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది క‌నుక జ‌రిగితే నంద‌మూరి అభిమానుల ఆనందానికి అడ్డుక‌ట్ట వేయ‌డం అసాధ్యం.

ఇక బాల‌య్య‌, ఎన్టీఆర్ మ‌ధ్య విభేదాలు ఉన్నాయ‌నే రూమ‌ర్స్ కూడా అస‌త్య ప్ర‌చారాలుగా మిగిలిపోవ‌డం ఖాయం. సెప్టెంబ‌ర్ 1న విడుద‌ల కానున్న పైసా వ‌సూల్ సినిమా ప్ర‌మోష‌న్ కోసం నంద‌మూరి బాలయ్య బిగ్ బాస్ హౌజ్ లోకి ఎంట్రీ ఇస్తే ఎపిసోడ్ టీఆర్ పి రేటింగ్ మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు.