బాలయ్య నటిస్తున్న `అఖండ` చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. సోమవారం నుంచి `అఖండ` షూటింగ్‌ రీ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏకంగా సెట్‌లోని ఓ పోస్టర్‌ని పంచుకుంది యూనిట్‌. 

కరోనా సెకండ్‌ వేవ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడు వరుసగా సినిమాల షూటింగ్‌లు ప్రారంభమవుతున్నాయి. మరోవైపు రెడీగా ఉన్న చిత్రాలను విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రోజు(జులై 12) దాదాపు అడజనుకుపైగా చిత్రాలు షూటింగ్‌లు ప్రారంభమయ్యాయి. `సర్కారు వారి పాట`, రవితేజ నటిస్తున్న `రామారావు`, అఖిల్‌ `ఏజెంట్‌`, రామ్‌ `రాపో19` చిత్రాలు సెట్స్ పైకి వెళ్లాయి. ఇందులో మరో సినిమా చేరింది. బాలయ్య నటిస్తున్న `అఖండ` చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. 

సోమవారం నుంచి `అఖండ` షూటింగ్‌ రీ స్టార్ట్ చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా ఏకంగా సెట్‌లోని ఓ పోస్టర్‌ని పంచుకుంది యూనిట్‌. అఘోర లుక్‌లో బాలయ్య కనిపిస్తున్నారు. ఆయనకి సీన్‌ని వివరిస్తున్నాడు దర్శకుడు బోయపాటి శ్రీను. వెనకాల కమాండోల సెక్యూరిటీ కనిపిస్తుంది. ఇది ఆద్యంతం ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా ఫైనల్‌ షెడ్యూల్‌ని నేటి నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరించబోతున్నారట. కీలక సన్నివేశాలను షూట్‌ చేయనున్నారట. ఈ షెడ్యూల్‌తో షూటింగ్‌ మొత్తం పూర్తి కానుంది. త్వరలోనే విడుదల చేసేందుకు రెడీ చేస్తున్నారు. 

Scroll to load tweet…

ఇందులో బాలకృష్ణ రెండు గెటప్‌లో కనిపించబోతున్నారు. ఒకటి ఊరు పెద్దగా, మరోటి అఘోరగా కనిపిస్తాడు. ఇప్పటికే విడుదలైన రెండు లుక్‌ల టీజర్లు గూస్‌బమ్స్ తెప్పించాయి. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ కథానాయికగా నటిస్తుంది. శ్రీకాంత్‌ విలన్‌గా నటిస్తున్నారు. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. బాలయ్య, బోయపాటిల హిస్టరీని ఈ సినిమాతో రిపీట్‌ చేయబోతున్నట్టు చిత్ర యూనిట్‌ పేర్కొంది.