Asianet News TeluguAsianet News Telugu

ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టబోతున్న బాలయ్య చిన్నల్లుడు, భారీ స్కెచ్ వేసిన భరత్

నందమూడి ఇంటి నుంచి వారసత్వంగా మరొకరు ఇండస్ట్రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. బాలయ్య చిన్నల్లుడు ఇండస్ట్రీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే హీరోగానో, విలన్ గానో కాదు.. కాస్త డిఫరెంట్ గా ట్రై చేయబోతున్నారని సమాచారం. ఇంతకీ ఏం చేయబోతున్నారంటే..? 

Balakrishna son in law Bharat Tollywood entry
Author
First Published Dec 24, 2022, 6:26 PM IST

ఇప్పటికే టాలీవుడ్ లో సినిమా ఇండస్ట్రీ నుంచి వచ్చిన వారసులు చాలా మంది ఉన్నారు. ఇంకా వస్తూనే ఉన్నారు. అయితే హీరోలుగా, హీరోయిన్లుగా మాత్రమే కాకుండా.. దర్శకులుగా, నిర్మాతలుగా.. ఇలా ఇతర వాటివైపు కూడా చూస్తున్నారు. ఈక్రమంలోనే నందమూరి ఇంటి నుంచి మరో వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. బాలయ్య చిన్నల్లుడు భరత్ సినిమాల వైపు చూస్తున్నాడట. 

బాలకృష్ణ చిన్నల్లుడు.... గీతం విద్యా సంస్థల అధిపతి భరత్ టాలీవుడ్ లో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ తన కొడుకు మోక్షజ్ఞతో సినిమా  ప్లానింగ్ లో ఉన్నారు. బాలయ్య ఆల్ టైమ్ హిట్  ఆదిత్య 360 సీక్వెల్ ను సొంత బ్యానర్ పై నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాకు భరత్ తరపునుంచి ఆయన భార్య.. బాలకృష్ణ చిన్న కూతురు  తేజస్విని నిర్మాతగా ఉంటారని వార్తలొస్తున్నాయి. కానీ ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. బాలయ్యతో బోయపాటి తెరకెక్కిస్తున్న నెక్ట్స్ సినిమాలో కూడా  కొంత వాటాను తేజస్విని ఆమె భర్త భరత్ లు పెట్టబోతున్నట్టు ప్లాన్ చేస్తున్నారట. 

బాలయ్య-బోయపాటి సినిమాను 14 రీల్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇందులో మరికోంత మందిని భాగ్వాములుగా తీసుకునే అవకాశం ఉంది. దాని వల్ల బడ్జెట్ కూడా కాస్త పెంచుకోవచ్చని భావిస్తుననారట.ఈ సినిమాలో ఇరవై శాతం పెట్టుబడి పెట్టడానికి తేజస్విని, ఆమె భర్త భరత్ ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఈ సినిమాను 2023 జూన్ నుంచి సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి సినిమా చేస్తున్నారు. ఈమూవీ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. 

ఈసినిమా తరువాత వెంటనే అనిల్ రావిపూడితో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్ళబోతున్నాడు బాలయ్య. ఈమూవీని సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడట. ఇక అనిల్ సినిమా సెట్స్ మీద ఉండగానే బోయపాటి సినిమాకు కొబ్బరికాయ కొట్టేలా సెట్ చేస్తున్నారట. ఇక బాలయ్య , బోయపాటి కాంబోలో సినిమా అంటే అది ఏ రేంజ్ లో ఉంటుందో తెలిసిందే కదా..? 

Follow Us:
Download App:
  • android
  • ios