చిరు, నాగ్, వెంకీ ఒకే వేదికపై.. బాలయ్య మిస్సింగ్. అందుకేనా?

balakrishna skipping nagachaitanya samantha wedding reception creating buzz
Highlights

  • హైదరాబాద్ లో గ్రాండ్ గా చైతూ సామ్ ల వివాహ వేడుక
  • వేడుకకు హాజరై జంటను ఆశీర్వదించిన మెగాస్టార్
  • చైతూ,,సమంతల రిసెప్షన్ కు హాజరు కాని నందమూరి బాలకృష్ణ

తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్ర హీరోలుగా వున్న టాప్ నలుగురు ఎవరో తెలుగు వాళ్లందరికీ తెలుసు. మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునలంటే టాప్ ఫోర్ హీరోలుగా మనందరికీ తెలుసు. ఈ హీరోలంతా సంక్రాంతి రేసులో పడితే... అభిమానులకు రేసులు, ప్రేక్షకులకు వినోదం.. అబ్బో తెలుగు హీరోల్లో ఈ నలుగురు హీరోలు టాప్ లేపేసారు. ఇక ఈ నలుగురు హీరోలు ఒకే వేదికపై సందడి చేస్తే... అబ్బో ప్రేక్షకులకు కన్నుల విందే. అయితే నలుగురు కాకున్నా ముగ్గురు మాత్రం ఈ ఆదివారం ఒకే వేదికపై సందడి చేశారు. అదే నాగచైతన్య, సమంత వివాహ రిసెప్షన్ వేడుక.

 

కానీ ఇదే వేదిక నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలు ఉన్నాయనే విషయం మరోసారి తెరమీదకు తెచ్చింది. నవంబర్ 12న జరిగిన నాగ చైతన్య, సమంత పెళ్లి రిసెప్షన్‌కు తెలుగు, తమిళ సినిమా ప్రముఖులందరూ తరలివచ్చారు. అయితే నందమూరి బాలకృష్ణ ఈ వేడుకలో కనిపించకపోవడంతో మళ్లీ వీళ్ల మధ్య విభేదాలు ఉన్నాయనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది.

 

టాలీవుడ్‌లో నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య మంచి సంబంధాలున్నాయి. ఎన్టీఆర్, ఏఎన్నార్ లు చాలా సన్నిహితంగా మెలిగేవారు. కుటుంబ పరంగానూ, ఫ్యాన్స్ పరంగానూ ఎలాంటి గందరగోళం లేకుండా చూసుకొన్నారు. వీళ్ల వారసులు నాగార్జున, బాలకృష్ణ కూడా చాలా కాలం అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. పలు వేదికలపై కలిసి కనిపించారు. అయితే కొన్ని రోజులుగా నాగ్, బాలయ్యల మధ్య విబేధాల వల్లే ఎక్కడా వేదిక పంచుకోవట్లేదని.. అందుకే ఇప్పుడు నాగచైతన్య, సమంతల రిసెప్షన్ కు కూడా రాలేదని ఫిలిం సర్కిల్లో చర్చ జరుగుతోంది.

 

బాలయ్య, నాగార్జున మధ్య విభేదాలు నెలకొనడానికి కారణం చాలా చిన్నదని, కొన్నాళ్ల క్రితం జరిగిన ఓ కార్యక్రమంలో తనకు తగిన ప్రాధాన్యతనివ్వలేదని బాలయ్య నొచ్చుకొన్నారట. అప్పటినుంచి వారిమధ్య అలా మొదలైన విభేదాలు తారాస్థాయికి వెళ్లినట్టు చెప్పుకొంటారు. అక్కినేని నాగేశ్వరరావు మరణించినప్పుడు కూడా బాలయ్య రాకపోవడంపైనా అప్పట్లో బాగానే చర్చ జరిగింది.

 

ఇక తాజాగా చైతూ, సామ్ రిసెప్షన్‌లో నందమూరి హరికృష్ణ కనిపించారు. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తదితరులు హాజరయ్యారు. ఇక వెంకీ చైతూకు మేనమామేనాయె. ఐతే బాలయ్య కూడా వస్తాడని అంతా ఆశించారు. కానీ ఆయన రాకపోవడం వల్ల మళ్లీ సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. చైసామ్ రిసెప్షన్‌కు పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, మహేశ్‌బాబుతోపాటు చాలా మంది ఇండస్ట్రీ నుంచి రాకపోయినా పెద్దగా పట్టించుకోలేదు. కానీ బాలయ్య హాజరుకాకపోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారింది. అయితే బాలయ్య వ్యక్తిగత పనుల వల్లే రాలేకపోయాడని ఆయన సన్నిహితుల మాట. అసలు విషయం పెరుమాళ్లకెరుక.

loader