సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ ఎక్కువ. వాటిని మూఢ నమ్మకాలు అని ఎంతమంది ఏమన్నా పెద్దగా పట్టించుకోరు. ముఖ్యంగా కెరీర్ డౌన్ లో  ఉన్నప్పుడు ఈ సెంటిమెంట్స్ మరీ విజృంభిస్తూంటాయి. బాలయ్య కూడా సెంటిమెంట్స్, జ్యోతిషం ఎక్కువగా నమ్మే వ్యక్తి. ఆయన రీసెంట్ గా నిర్మించి, నటించిన కథానాయకుడు, మహానాయుకుడు రెండు చిత్రాలు డిజాస్టర్స్ అయ్యాయి. ఈ నేపధ్యంలో ఈ సారి బలమైన కథకు తోడు తను నమ్మే సెంటిమెంట్స్ ని కూడా కె.ఎస్ రవికుమార్ తో చేయబోయే సినిమాకు అప్లై చేస్తున్నట్లు తెలుస్తోంది. అవేంటో చూద్దాం. 

బాలకృష్ణ ఇప్పటికే  చాలా చిత్రాల్లో ద్విపాత్రాభినయం చేసి హిట్ కొట్టారు. దాంతో ఈ . ఆ లిస్ట్ లో ఈ  చిత్రం చేరబోతోంది. ‘జైసింహా’ తర్వాత బాలకృష్ణ - కె.ఎస్‌.రవికుమార్‌ కలిసి మరో చిత్రం కమిటైన సంగతి తెలిసిందే. సినిమాకు సంబంధించి స్టోరీ ఇప్పటికే లాక్ అయింది. మే  నెలలో రామోజీ ఫిలింసిటీలో ఈ చిత్రానికి కొబ్బరికాయ కొట్టి,జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతన్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో  బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు సమాచారం.

అలాగే  విలన్ గా జగపతిబాబు నటించబోతున్నట్టు తెలుస్తోంది. జగపతిబాబు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజండ్ చిత్రాలు ఎంత పెద్ద హిట్టో తెలిసిందే. దాంతో మరోసారి జగపతిబాబుని ఈ సినిమాకు విలన్ గా తీసుకుంటున్నారు. 

అలాగే ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఖాకీ చొక్కా తో ఫ్యాన్స్ కు పండగచేయబోతున్నారు.  రౌడీ ఇన్ స్పెక్టర్, లక్ష్మీనరసింహ  వంటి సినిమాల్లో  పోలీస్ గా కనపడి మంచి హిట్స్ కొట్టిన బాలయ్య, ఇప్పుడు మరోసారి ఆ సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నాడు.  ద్విపాత్రాభినయం, ఖాకీ చొక్కా తనను ప్లాఫ్ ల నుంచికాపాడీ హిట్ వైపు ప్రయాణంమ పెట్టిస్తాయని భావిస్తున్నారు.   అంతేకాదు ఈ  సినిమాలో బాలయ్య పాత్ర అక్కడక్కడ నెగెటివ్ షేడ్స్ లో కూడా కనిపిస్తుందట.

 

ఏదైమైనా ఇవన్నీ చూస్తూంటే.. మరోసారి బాలయ్య... పవర్ఫుల్ యాక్షన్ చిత్రాన్ని తెరపై చూడవచ్చు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు.  ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాను కంటిన్యూ షెడ్యూల్ తో గ్యాప్ లేకుండా ఫినిష్ చేయాలని డిసైడ్ చేసారు బాలయ్య. ఈ సినిమా పూర్తయిన వెంటనే బోయపాటి దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేసే అవకాసం ఉంది.