అన్ స్టాపబుల్ షో అనేక ఆసక్తికర విషయాలకు చర్చా వేదికగా మారుతుంది. రొటీన్ కి భిన్నంగా సాగుతున్న ఈ షో పట్ల ప్రేక్షకులు ఆకర్షితులు అవుతున్నారు. గెస్ట్ గా వచ్చిన శర్వానంద్ హోస్ట్ బాలయ్యను ఒక ప్రశ్న అడగ్గా ఆయన చెప్పిన సమాధానం వైరల్ అవుతుంది.
అన్ స్టాపబుల్ సీజన్ 2 సైతం విజయపధంలో దూసుకుపోతుంది. మొదటి రెండు ఎపిసోడ్స్ కి గెస్ట్స్ గా నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ రావడం జరిగింది. మూడవ ఎపిసోడ్ గెస్ట్స్ గా మరో ఇద్దరు యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్ వచ్చారు. కుర్ర హీరోలతో బాలయ్య హోస్టింగ్ ఎలా ఉంటుందో విశ్వక్, సిద్ధుల ఎపిసోడ్ చూస్తే అర్థం అవుతుంది.శర్వా, అడివి శేష్ ని కూడా బాలయ్య అదే స్థాయిలో ఆడుకున్నాడు. ప్రేక్షుకులను ఎంటర్టైన్ చేశారు.
అన్ స్టాపబుల్ షో బోల్డ్ ప్రశ్నలకు వేదిక కాగా ఎఫైర్ రూమర్స్ తో పాటు అనేక విషయాలు చర్చకు వచ్చాయి. ఈ క్రమంలో శర్వానంద్ ఒక సందేహం బాలయ్యను ధైర్యం చేసి అడిగారు. సార్ మీరు అనేక మంది హీరోయిన్స్ తో పని చేశారు కదా. ఎఫైర్ రూమర్స్ రాకుండా ఎలా మ్యానేజ్ చేశారు? అన్న సందేహం వెళ్లబుచ్చాడు. దానికి బాలయ్య తన మార్కు సమాధానం చెప్పాడు.
బాలయ్య మీద రాసే దమ్ము ఉందా... అని రాయల్ ఆన్సర్ ఇచ్చారు. బాలయ్య సమాధానానికి శర్వా, అడివి శేష్ షాక్ తిన్నారు. బాలయ్య అలా గొప్పగా చెప్పుకున్నా ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు కాబట్టి బ్రతికిపోయారు. జనాల్లో ఇంత చైతన్యం, అవగాహన కూడా లేదు. హీరో నిజంగానే బిల్డింగ్ పై నుండి దూకుతాడని నమ్మే జనాలున్న రోజులవి. జర్నలిస్ట్స్ ధైర్యం చేసి హీరోల ఎఫైర్స్ గురించి పత్రికల్లో రాయాలనుకున్నా ప్రింట్ అయ్యే లోపు చేరాల్సిన వాళ్లకు వార్త చేరిపోయేవి. అలా గాల్లో కలిసిపోయేవి. దీంతో ఆనాటి హీరోల ఎఫైర్స్ చాలా గోప్యంగా ఉండేవి. కొద్దిమంది స్టార్స్ చీకటి విషయాలు మాత్రమే బయటకు వచ్చేవి. ఇప్పుడు సోషల్ మీడియా ఉన్నా వాళ్లకు వయసైపోయింది కాబట్టి ఎఫైర్స్ అనే మాటేలేదు.
కాగా కెరీర్ బిగినింగ్ నుండి బాలయ్య ఇద్దరు ముగ్గురు హీరోయిన్స్ తో ఎఫైర్స్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి. ముఖ్యంగా ఒక టాప్ స్టార్ హీరోయిన్ తో బాలకృష్ణ బహిరంగంగానే ఎఫైర్ నడిపారన్న వాదన ఉంది. ఓ మూవీ విషయంలో ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో మళ్ళీ కలవలేదని సమాచారం
