`అఖండ` సినిమాలో జంటగా నటించి అలరించారు బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్‌. ఈ జోడీకి మంచి పేరొచ్చింది. తాజాగా మరోసారి ఈ ఇద్దరు కలిశారు. ప్రస్తుతం వీరి ఫోటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

బాలకృష్ణ, ప్రగ్యా జైశ్వాల్‌ కలిసి `అఖండ` చిత్రంలో నటించారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. 2021 డిసెంబర్‌ 1న విడుదలైన ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగానూ నిలిచింది. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్ తోనూ కరోనా నుంచి టాలీవుడ్‌ కోలుకుని, ఆ తర్వాత పుంజుకుంది. 

`అఖండ`లో బాలయ్యకి జోడీగా ప్రగ్యా జైశ్వాల్‌ మెరిసి ఆకట్టుకుంది. ఇద్దరి మధ్య వచ్చే రొమాన్స్, పాటలు, కామెడీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఈ జోడీ కలిసింది. అభిమానులను కనువిందు చేస్తుంది. ప్రస్తుతం ఈ ఇద్దరు దిగిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఇప్పుడు కలిసిన లెక్క వేరే. ఈ ఇద్దరు సినిమా కోసం కాదు, యాడ్‌ కోసం కలిసి నటించారు. ఓ జ్యూవెల్లరి యాడ్‌ కోసం ఈ ఇద్దరు గ్రాండియర్‌గా ముస్తాబై కనువిందు చేస్తున్నారు. `వేగ శ్రీ` అనే జ్యూవెల్లరి యాడ్‌ కోసం ఈ జంట మరోసారి సందడి చేయడం విశేషం. 

ఇదిలా ఉంటే కెరీర్‌లోనే రెండోసారి యాడ్‌ చేశారు బాలయ్య. గతంలో ఆ మధ్య ఓ రియల్‌ ఎస్టేట్‌, ప్రాపర్టీస్‌కి సంబంధించిన యాడ్‌లో మెరిశారు. తనదైన రాయల్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేశారు. ఇప్పుడు ట్రెడిషనల్‌ లుక్‌లో, జ్యూవెల్లరి ధరించి, ప్రగ్యా జైశ్వాల్‌తో కలిసి సందడి చేశారు. ఈ ఇద్దరు కలిసి ఫోటో షూట్‌ చేయగా, ఆ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. 

`అఖండ` సినిమాతో సక్సెస్‌ అందుకుంది ప్రగ్యా జైశ్వాల్‌. దీంతో ఆమె కెరీర్‌ టర్న్ తీసుకున్నట్టే అని అంతా భావించారు. కానీ ఆ తర్వాత ఒక్క ఆఫర్‌ కూడా ఆమెకి రాలేదు. కమర్షియల్‌ యాడ్స్, ఫోటో షూట్లతోనే కాలం వెల్లదీస్తుంది. ఇదిలా ఉంటే ఈ సంక్రాంతికి `వీరసింహారెడ్డి` చిత్రంతో హిట్‌ కొట్టాడు బాలయ్య. రాయలసీమ ప్యాక్షన్‌ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రానికి గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతి కానుకగా విడుదలై పెద్ద హిట్‌ అయ్యింది. ఇప్పుడు బాలయ్య.. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో `ఎన్బీకే108` చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ఇది నెక్స్ షెడ్యూల్‌ని ప్రారంభించుకోనుంది.