గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కించుకున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రానికి బాలకృష్ణ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ అభినందనలు తెలిపారు. ప్రశంసలతో ముంచెత్తారు.

గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుల్లో `ఆర్‌ఆర్‌ఆర్‌` విజయకేతం ఎగరవేసింది. `నాటు నాటు` సాంగ్‌కిగానూ అవార్డుని దక్కించుకున్న విషయం తెలిసిందే. దీంతో సెలబ్రిటీలు టీమ్‌కి విషెస్‌ తెలియజేస్తున్నారు. తాజాగా బాలకృష్ణ, ప్రభాస్‌, అల్లు అర్జున్‌ వంటి వారు అభినందనలు తెలిపారు. సోషల్‌ మీడియా వేదికగా వాళ్లు ప్రశంసలు కురిపించారు. ప్రభాస్‌ ఇన్ స్టాగ్రామ్‌లో విషెస్‌ తెలియజేశారు.

ఆయన చెబుతూ, `గోల్డెన్‌గ్లోబ్‌ అవార్డుని అందుకున్న మొదటి ఆసియా పాట `నాటు నాటు` అని తెలియడం చాలా ఆనందంగా ఉంది. మరో చరిత్ర సృష్టించిన `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్ర బంధానికి, కీరవాణికి నా ప్రత్యేక అభినందనలు. మీరు భారతీయ సినిమా శక్తి, మాయా జాలాన్ని ప్రపంచానికి చూపించారు` అని పోస్ట్ చేశారు ప్రభాస్‌. 

View post on Instagram

బాలకృష్ణ సైతం `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి అభినందనలు తెలిపారు. `నాటు నాటు` సాంగ్‌కి `గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డుని అందుకున్న `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి నా అభినందనలు` అని ఫేస్‌ బుక్‌ ద్వారా విషెస్‌ చెప్పారు. అలాగే ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ కూడా విషెస్‌ చెప్పారు. `బిగ్‌ బిగ్‌ బిగ్‌ కంగ్రాచ్యులేషన్స్. ఇది గర్వపడే సందర్భం. `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌కి అభినందనలు` అని చెప్పారు. 

Scroll to load tweet…

లాస్‌ ఏంజెల్స్ నగరంలో అట్టహాసంగా జరిగిన ఈ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారాల్లో తెలుగు సినిమాకి అవార్డు రావడం గర్వించదగ్గ విషయమనే చెప్పాలి. ఇది యావత్‌ ఇండియా గర్వపడే విషయం. ఇండియన్‌ సినిమాకే ఇలాంటి పురస్కారం రావడం ఫస్ట్ టైమ్‌ అయితే, అది తెలుగు సినిమా, తెలుగు పాట కావడం మరింత గర్వకారణం. కీరవాణి చేసిన మ్యాజిక్‌, రాహుల్‌ సింప్లిగంజ్‌ పాడిన పాట, ఎన్టీఆర్‌, చరణ్‌ వేసిన స్టెప్పులు కలగలిపిన అరుదైన విషయంగా చెప్పొచ్చు. `ఆర్‌ఆర్‌ఆర్‌` ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచిన విషయం తెలిసిందే. దర్శకత్వం, ఉత్తమ నటుడు, ఒరిజినల్‌ సాంగ్‌ విభాగాల్లో పోటీ పడబోతుంది.