ఇటీవల సీనియర్‌ నటుడు చలపతిరావు హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన 11వ రోజు కార్యక్రమంలో చలపతిరావు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు బాలకృష్ణ. 

సీనియర్‌ నటుడు చలపతి రావు ఇటీవల హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేసిన బాలకృష్ణ.. తాజాగా 11వ రోజు కార్యక్రమానికి హాజరయ్యారు. చలపతి రావు చిత్రపటానికి నివాళ్లు అర్పించారు. మంగళవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొని తన నివాళ్లు అర్పించారు. ఈ సందర్భంగా చలపతిరావుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు బాలకృష్ణ. 

ఇందులో చలపతిరావు తనయుడు, దర్శక, నటుడు రవిబాబు, వారి ఫ్యామిలీ మెంబర్స్ పాల్గొన్నారు. బాలకృష్ణతో కలిసి వారు ఫోటోలు దిగారు. ఈ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి.గతేడాది డిసెంబర్‌ 25న నటుడు చలపతిరావు కన్నుమూసిన విషయం తెలిసిందే. అర్థరాత్రి ఆయన భోజనం చేశాక కన్నుమూసినట్టు కుమారుడు రవిబాబు వెల్లడించారు. దీంతో టాలీవుడ్‌ ఒక్కసారిగా షాక్‌ కి గురయ్యింది. ఆయన మృతి పట్ల అంతా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. 

టాలీవుడ్‌లో 1200లకుపైగా చిత్రాల్లో నటించి మెప్పించారు చలపతిరావు. విలన్‌ పాత్రలకు పెట్టింది పేరు. అంతేకాదు తండ్రి పాత్రలు, కామెడీ పాత్రలు, మొత్తంగా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా విభిన్న పాత్రల్లో నటించి మెప్పించారు. కానీ ఆయనకు నెగటివ్‌ షేడ్స్ ఉన్న పాత్రలే బాగా పేరుతెచ్చాయి. ఇదిలా ఉంటే బాలకృష్ణకి, చలపతిరావుకి మంచి అనుబంధం ఉంది. బాలయ్య నటించిన దాదాపు అన్ని సినిమాల్లో చలపతిరావు నటించేవారు. 

ప్యాక్షన్‌ చిత్రాల్లో మాత్రం చలపతిరావు ఉండాల్సిందే. అలా ఆ మధ్య వచ్చిన `రూలర్‌`, `లయన్‌`, `లెజెండ్‌`, `సింహ`, `అల్లరి పిడుగు`, `ముద్దుల మొగుడు` వంటి పలు సినిమాల్లో నటించారు. బాలకృష్ణకి మరింత దగ్గరయ్యారు. బాలకృష్ణ ప్రస్తుతం `వీరసంహారెడ్డి` చిత్రంలో నటిస్తున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహిస్తున్న చిత్రమిది. శృతి హాసన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ట్రైలర్‌ని ఈ నెల 6న రిలీజ్‌ చేయబోతున్నారు. అదే రోజు ఒంగోల్‌లో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ని నిర్వహించనున్నట్టు ప్రకటించారు.