Asianet News TeluguAsianet News Telugu

Balakrishna:రాత్రికి మ్యాన్షన్ హౌస్ తాగడం... తెల్లవారు జామున గోడలు దూకడం... బాలయ్యలో కొత్తకోణం!

మోహన్ బాబుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మంచు విష్ణు, లక్ష్మీ ఫస్ట్ ఎపిసోడ్, బాలయ్య గెస్ట్స్ గా వచ్చారు. ఊహించినదానికి మించి బోల్డ్, కాంట్రవర్షియల్ విషయాలతో ఈ టాక్ షో సాగడం విశేషం.

balakrishna opens up on his drinking habit here are interesting details
Author
Hyderabad, First Published Nov 5, 2021, 11:46 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా ఆహాలో మొదలైన టాక్ షో అన్ స్టాపబుల్ మొదటి ఎపిసోడ్ పూర్తి చేసుకుంది. డైలాగ్ కింగ్ మోహన్ బాబుతో పాటు ఫ్యామిలీ మెంబర్స్ మంచు విష్ణు, లక్ష్మీ ఫస్ట్ ఎపిసోడ్, బాలయ్య గెస్ట్స్ గా వచ్చారు. ఊహించినదానికి మించి బోల్డ్, కాంట్రవర్షియల్ విషయాలతో ఈ టాక్ షో సాగడం విశేషం. మందు తాగే అలవాటు పరిశ్రమలో 90 శాతానికి పైగా నటులకు ఉంటుందని టాక్. వాళ్ళ వృత్తిరీత్యా టెన్షన్స్, హెవీ షెడ్యూల్స్, వేళకాని వేళలో నిద్ర, తిండి వంటి పరిస్థితుల వలన ఆల్కహాల్ కి అలవాటు పడతారు. 


అయితే మాకు మందు అలవాటు ఉన్నట్లు పబ్లిక్ గా ఎవరూ చెప్పరు. Balakrishna అన్ స్టాపబుల్ షోలో సీనియర్ హీరోలు ఇద్దరూ ఈ విషయంలో పచ్చిగా ఓపెన్ అయ్యారు. హోస్ట్ బాలయ్య ప్రశ్నకు సమాధానంగా మోహన్ బాబు.. చెన్నైలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్న రోజులలో... డబ్బులు లేక 25పైసలు పెట్టి సారాయి తాగే వాడిని. కోడంబాక్కం బ్రిడ్జ్ క్రింద వరుసగా సారాయి దుకాణాలు ఉండేవి. అక్కడకు నేను నా స్నేహితుడితో పాటు వెళ్ళేవాడిని. రిక్షా వాళ్ళతో పాటు సారాయి తాగేవాడిని, వాళ్ళు పెట్టిన పచ్చడి, నాకే వాడిని. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కాబట్టి రాయల్ గా విస్కీ తాగుతున్నాను... అని అన్నారు. 


ఇక బాలయ్య సైతం తన మందు అలవాటు గురించి మాట్లాడారు. నాకు మ్యాన్షన్ హౌస్ తాగే అలవాటు ఉంది. సాయంత్రం అయితే.. 'మామా ఓ పెగ్ లా' అన్నట్లు ఉంటుంది వ్యవహారం. ఇక ప్రతి రోజూ ఉదయం మూడు లేదా నాలుగు గంటలకు నిద్రలేస్తాను. కేబీఆర్ పార్క్ కి జాగింగ్ కి వెళతాను. ఆ సమయానికి పార్క్ గేట్స్ ఓపెన్ చేయరు. అందుకే నేను రోజూ గోడదూకి వెళ్ళేవాడిని. ఆ రోజుల్లో చాలా మందికి గోడలు దూకడం నేర్పించాను... అంటూ బాలయ్య బోల్డ్ గా ఉన్న విషయం చెప్పేశారు. 


బాలయ్య యాంటీ ఫ్యాన్స్ ఎప్పటి నుండో... ఆయన Manshion house బ్రాండ్ పై ట్రోల్స్ చేస్తున్నారు. స్వయంగా బాలయ్యే ఈ విషయాన్ని ఒప్పుకోవడం ద్వారా వాళ్ళ నోటికి కళ్లెం వేశారు. పరిశ్రమలో టాప్ పొజిషన్ లో ఉన్న ఇద్దరు ప్రముఖులు, తమ మందు అలవాటు గురించి పబ్లిక్ గా చెప్పడం, ప్రాధాన్యత సంతరించుకుంది. అదే సమయంలో ఈ టాక్ షో సూపర్ సక్సెస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరో మాటగా Mohan babu, బాలయ్య సినిమాలో విలన్ గా నటించడానికి సిద్ధం అన్నారు. 

Also read 'అఖండ' టైటిల్ సాంగ్ ప్రోమో: బాలయ్య యోగ మాయ.. ఫ్యాన్స్ కు థియేటర్లు బద్దలయ్యే ట్రీట్
ఇక దీపావళి కానుకగా విడుదలైన అఖండ లిరికల్ సాంగ్ ప్రోమో ఆకట్టుకుంది. యూట్యూబ్ లో రికార్డు వ్యూస్ రాబడుతుండగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న Akhanda మూవీలో ఓ పాత్రలో బాలకృష్ణ అఘోర గా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, మిర్యాల రవీంద్రారెడ్డి నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Also read Samantha: సమంత షాకింగ్ డెసిషన్... ఆందోళనలో ఫ్యాన్స్.. అదే జరిగితే అందరి మైండ్ బ్లాక్!
 

Follow Us:
Download App:
  • android
  • ios