రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్

First Published 25, Jun 2018, 3:05 PM IST
Balakrishna NTR biopic in 2 parts
Highlights

రెండు భాగాలుగా ఎన్టీఆర్ బయోపిక్ 

నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా బాలకృష్ణ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న 'ఎన్టీఆర్' పై మరో ఆసక్తికరమైన వార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఎన్టీఆర్ జీవిత చరిత్రను మూడు గంటల సినిమాగా చూపించడం చాలా కష్టమని భావిస్తున్న దర్శకుడు క్రిష్, రెండు భాగాలుగా దీన్ని తెరకెక్కించాలని అనుకుంటున్నారట. 

ఒక భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని, మరో భాగంలో రాజకీయ ప్రయాణాన్ని చూపాలని ఆయన అనుకుంటున్నట్టు సమాచారం. ఈ మేరకు బాలకృష్ణతో తమ మనసులోని విషయాన్ని క్రిష్ చర్చించారని తెలుస్తోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. కాగా, ఈ సినిమాకు తొలుత తేజను డైరెక్టర్ గా తీసుకున్న బాలయ్య, ఆ తరువాత ఆయన్ను తప్పించిన సంగతి తెలిసిందే.

loader