బాల‌య్య‌.. మ‌రో షాకింగ్ డెసిషన్!?

బాలయ్య కథలు ఓకే చేసే పద్దతి డిఫరెంట్ గా ఉంటుందని చెప్తారు. ఆయన స్క్రిప్టుని నమ్ముతారు. ఆ తర్వాత ఆ డైరక్టర్ ని పూర్తిగా నమ్ముతూంటారు. ఓ సారి ఫిక్స్ అయ్యాక ఆయన అసలు వేలు పెట్టరు. డైరక్టర్ ఏది ఎలా చెప్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతూంటారు. అంతేకానీ వాళ్ల ట్రాక్ రికార్డ్ లు చూసి ఆఫర్స్ ఇవ్వరు. తన దగ్గరకు వచ్చి, తనతో చేస్తాననే దర్శకుడు ఫ్లాఫ్ లలో ఉన్నా ఓకే అంటారు. అలా తాజాగా ఆయన మరో దర్శకుడు అవకాసం ఇచ్చారు. అయితే బాలయ్యతోనే ఫ్లాఫ్ సినిమా తీసిన దర్శకుడు ఆయన. ఆ డైరక్షన్ లో మరో సినిమా అనగానే ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఆ దర్శకుడు ఎవరూ అంటే..
 
Balakrishna next with Sri vasu again? jsp

ఈ మధ్యన వరస పెట్టి బాలయ్య కథలు వింటున్నారు. కొత్తదనం కన్నా ముందు తన బాడీ లాంగ్వేజ్ కు తగ్గ కథలపై ఆసక్తి చూపిస్తున్నారట. కొత్తదనం పేరుతో ఏవోవో కాన్సెప్టులు తెరకెక్కించేకన్నా ..లైన్ పాతదయినా స్క్రీన్ ప్లే తో దాన్ని పండించే డైరక్టర్ కే ఆయన జై కొడుతున్నారు. ఆ క్రమంలోనే ఆయన ఓ దర్శకుడుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటున్నారు. ఆ ద‌ర్శ‌కుడు ఎవ‌రో కాదు.. శ్రీ‌వాస్‌. బాల‌కృష్ణ‌తో ఇది వ‌ర‌కు `డిక్టేట‌ర్‌` తీశాడు శ్రీ‌వాస్‌. ఆ సినిమా డిజాస్టర్ అయ్యింది.

 శ్రీవాసు ఆ మధ్యన బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ తో `సాక్ష్యం` తెర‌కెక్కించాడు. అది కూడా ఆడలేదు. ఆ తర్వాత వెంకీతో ఓ హిందీ సినిమా రీమేక్ అనుకుని అడ్వాన్స్ కూడా తీసుకున్నారు. కానీ అది మెటీరియలైజ్ కాలేదు. ఈ క్రమంలో ఆయన ఓ కథ తయారు చేసుకున్నారు. బాలయ్య చుట్టూ ప్ర‌దక్షిణాలు చేస్తున్నాడు శ్రీ‌వాస్. దాదాపు ఆయన క‌థ‌నీ ఓకే చేసేశాడ‌ట‌. ప్రస్తుతం స్క్రిప్టు మార్పులు జరుగుతున్నాయట. అయితే ఇది ఎప్పుడు తెర‌కెక్కుతుందో తెలీదు. మరో ప్రక్క గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తాన‌ని బాలయ్య ఫిక్స్ అయ్యాడు. మైత్రీ మూవీస్ సంస్థ ఈచిత్రాన్ని తెర‌కెక్కిస్తుంది. ఆ త‌ర‌వాతే.. శ్రీ‌వాస్ సినిమా ఉంటుందని తెలుస్తోంది. 
 
Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios