బాలయ్య-గోపీచంద్ మూవీ డైలాగ్ లీక్... గూస్ బంప్స్ కలిగిస్తున్న పవర్ ఫుల్ డైలాగ్
అఖండ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన బాలయ్య నెక్స్ట్ మూవీ కి సిద్ధం అవుతున్నారు. దర్శకుడు గోపిచంద్ మలినేనితో బాలకృష్ణ తదుపరి చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే ఈ మూవీ డైలాగ్ ఒకటి లీకైంది.
2021లో సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యారు హీరో బాలకృష్ణ (Balakrishna), డైరెక్టర్ గోపిచంద్ మలినేని. వీరిద్దరి కాంబినేషన్ లో అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ రానుంది. బాలయ్య ఇమేజ్ కి తగ్గట్టుగా గోపిచంద్ అద్భుతమైన స్క్రిప్ట్ సిద్ధం చేసినట్లు సమాచారం. బాలయ్య ఫ్యాన్స్ కి మరో మాస్ ట్రీట్ ఈ మూవీతో దక్కనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఈ మూవీ టైటిల్స్ గా పలు పేర్లు తెరపైకి రావడం జరిగింది.అయితే అధికారికంగా టైటిల్ ప్రకటన జరగలేదు.
2022 ప్రధమార్ధంలో బాలయ్య-గోపిచంద్ (Gopichanda Malineni)మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. కాగా సెట్స్ పైకి కూడా వెళ్లకుండానే ఈ చిత్ర డైలాగ్ లీక్ చేశారు. బాలయ్య స్వయంగా దర్శకుడు గోపిచంద్ చేత ఈ పని చేయించారు. ఇటీవల బాలయ్య అన్ స్టాపబుల్ (Unstoppable)టాక్ షోకి రవితేజ, గోపిచంద్ మలినేని గెస్ట్స్ గా వచ్చిన విషయం తెలిసిందే. ఈ టాక్ షోలో ఈ ముగ్గురి మధ్య అనేక ఆసక్తికర విషయాలు చర్చకు వచ్చాయి. గోపీచంద్ అయితే నరసింహనాయుడు మూవీ కోసం పోలీస్ స్టేషన్ కి పోవాల్సి వచ్చిందని, పోలీసులు శాంపిల్ గా లాఠీతో ఒకటిచ్చారని చెప్పారు.
కాగా ఈ షోలో మన నెక్స్ట్ మూవీ నుండి ఒక డైలాగ్ చెప్పు అన్నారు. ఇక బాలయ్య మూవీ కోసం గోపీచంద్ సిద్ధం చేసిన ఓ డైలాగ్ ఓ షోలో చెప్పారు గోపీచంద్. 'రోడ్డు మీదకు గొర్రో, జింకో వచ్చాయనుకో హారన్ వేస్తాం.. అదే సింహం వస్తే ఇంజిన్ ఆపి సైలెంట్ గా బండిలో కూర్చుంటాం... ఇక్కడ ఉంది సింహంరా రేయ్' అంటూ గోపిచంద్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ కలిగించింది. ఇక ఈ సినిమా కోసం తనకు కలిసొచ్చిన హీరోయిన్ శృతి హాసన్ ని ఎంచుకున్నారు గోపీచంద్. గతంలో వీరి కాంబినేషన్ లో బలుపు, క్రాక్ తెరకెక్కాయి.ఇక బాలయ్య మూవీ హ్యాట్రిక్ కానుంది.
Also read Shyam Singha Roy: 'శ్యామ్ సింగ రాయ్' కి బాలయ్య ప్రశంసలు
ఇక అఖండ (Akhanda)విడుదలై నెల రోజులు దాటిపోయింది. అయినప్పటికీ థియేటర్స్ లో సందడి తగ్గలేదు. ఇంకా అఖండ థియేటర్స్ కి ప్రేక్షకుల ఫ్లో తగ్గలేదు. 2021 లో లాభాలు తెచ్చిపెట్టిన చిత్రాల్లో అఖండ ఒకటిగా నిలిచింది. బోయపాటి-బాలకృష్ణ మ్యాజిక్ మరోమారు వర్కవుట్ కావడం జరిగింది. అఖండ ప్రపంచ వ్యాప్తంగా రూ. 115 కోట్ల వరల్డ్ వర్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. బాలకృష్ణ కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా అఖండ రికార్డులకు ఎక్కింది.
Also read RRR Postponement:ఆర్ ఆర్ ఆర్ వెనక్కి పోయిందిగా.. భీమ్లా నాయక్ ని ముందుకు తెండి!