నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ పరాజయం, ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ ఓటమి నుంచి బయటకొచ్చి మళ్ళీ సినిమాలతో బిజీ అయ్యాడు. బాలయ్య హిందూపురం నుంచి విజయం సాధించడం కొంతవరకు ఆయన అభిమానులకు ఊరటనిచ్చే అంశం. ప్రస్తుతం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్. సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. 

ఇటీవల ఈ చిత్ర ఫస్ట్ షెడ్యూల్ ని బీహార్ లో పూర్తి చేశారు. తదుపరి షెడ్యూల్ ని బ్యాంకాక్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్లు సోనాల్ చౌహన్, వేదికలతో బాలయ్య నటించే సన్నివేశాలని బ్యాంకాక్ బీచ్ లో అందమైన లొకేషన్లలో దర్శకుడు చిత్రికరించబోతున్నట్లు తెలుస్తోంది. 

సి కళ్యాణ్ ఈ చిత్రానికి నిర్మాత. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. ఆగష్టు 7 నుంచి సెకండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుందట. అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిర్మాత ఉన్నారు. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథ అందిస్తున్నారు. 

ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో బాలయ్య నటించాల్సింది. కానీ కొన్ని కారణాలవల్ల ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. దీనితో బాలయ్య కెఎస్ రవి కుమార్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.