బాలకృష్ణ నెక్ట్స్ సినిమాల విషయంలో పెద్ద ట్విస్ట్ చోటు చేసుకుంది. తన కొత్త సినిమా ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ అయ్యింది. దర్శకుడి వివరాలుతెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే. 

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో `ఎన్బీకే109` చిత్రంలో నటిస్తున్నారు. దీనికి ఇంకా టైటిల్‌ని నిర్ణయించలేదు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో భారీ కాస్టింగ్ యాడ్‌ అవుతుంది. బాబీ డియోల్‌తోపాటు దుల్కర్‌ సల్మాన్‌, షైన్‌ టామ్‌ చాకో, అలాగే గౌతమ్‌ మీనన్‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దీంతో సినిమా రేంజ్‌ అమాంతం పెరిగిపోతుంది. సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు మరో సినిమా రాబోతుంది. బాలయ్య తన కొత్త సినిమాని ప్రారంభించబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. `అఖండ` సమయంలోనే మళ్లీ వీరి కాంబినేషన్‌లో సినిమా చేయబోతున్నట్టు తెలిపారు. `అఖండ2` రాబోతుందన్నారు. అయితే ఇప్పుడు సడెన్‌ ట్విస్ట్ ఇచ్చారు. బాలయ్య నెక్ట్స్ మూవీ జాబితాలో బోయపాటి చేరిపోయాడు. 

గీతా ఆర్ట్స్ ఈ మూవీని నిర్మించబోతుంది. ఆ మధ్య బోయపాటితో గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్‌ సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. హీరో ఎవరనేది చెప్పాలేదు. లేటెస్ట్ న్యూస్‌ ప్రకారం బాలయ్యనే హీరో అని తెలుస్తుంది. అయితే ఈ మూవీ `అఖండ2`నా కాదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే `అఖండ` నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. ఆయన ఈ మూవీలో భాగం కాలేదు. అలాంటప్పుడు ఆయన ప్రమేయంలేకుండా సీక్వెల్‌ తీయలేరు. 

మరి ఇప్పుడు బాలయ్యతో చేసే మూవీ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. `అఖండ2`నే ఇందులో తెరకెక్కిస్తున్నారా? ఇది వేరేనా? అనే ఆసక్తి ఏర్పడింది. అదే సమయంలో పెద్ద సస్పెన్స్ క్రియేట్‌ అయ్యింది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. అయితే తాజాగా ఓ క్రేజీ అప్‌డేట్‌ వినిపిస్తుంది. ఈ మూవీ ప్రారంభానికి మూహూర్తం కూడా ఫిక్స్ చేశారట. ఏప్రిల్‌ 9న బాలయ్య, బోయపాటి మూవీ ప్రారంభం కానుందని అంటున్నారు. థమన్‌ దీనికి సంగీతం అందించబోతున్నారు. 

ఇక ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న `ఎన్బీకే109` మూవీని త్వరగా చిత్రీకరణ పూర్తి చేసి జూన్‌లో రిలీజ్‌ చేయాలని భావిస్తున్నారట. లేదంట దసరాకి బరిలో దించే అవకాశం ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి. ఇటీవల ఈ మూవీ గ్లింప్స్ విడుదలైంది. గూస్‌ బంమ్స్ తెప్పించింది. సినిమాపై అంచనాలను పెంచేసింది.