Balakrishna: ఇక దబిడిదిబిడే అంటున్న బాలయ్య.. మరో డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్..?

బాలయ్య(Balakrishna) దూకుడుకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. సినిమాల రేసులో కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ(Balakrishna). ఇక బాలయ్య సినిమాల  లిస్ట్ లో మరో సినిమా  చేరినట్టు తెలుస్తోంది.

Balakrishna New Movie Update

బాలయ్య(Balakrishna) దూకుడుకు బాక్సాఫీస్ షేక్ అవుతుంది. సినిమాల రేసులో కుర్ర హీరోలతో పోటీ పడుతూ.. ఫుల్ ఎనర్జీతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ(Balakrishna). ఇక బాలయ్య సినిమాల  లిస్ట్ లో మరో సినిమా  చేరినట్టు తెలుస్తోంది.

అఖండ (Akhanda) సినిమా అఖండ విజయంతో  బాలకృష్ణ(Balakrishna) ఫుల్ జోష్ మీద ఉన్నాడు. బోయాటి కాంబినేషన్ లో  వచ్చిన హ్యాట్రిక్ మూవీ అందించిన భారీ విజయం బాలయ్య(Balakrishna)కు ఇంకా ఎక్కువగా బూస్ట్ అప్ ఇచ్చింది. 103 థియేటర్లలో ఈ సినిమా 50 రోజులు కంప్లీట్ చేసుకోవడంతో పాటు కోట్ల కలెక్షన్స్ తో బాక్సాఫీస్ ను శేక్ చేసింది. ఇక ఈ జోరులో వరుసగా సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు బాలకృష్ణ(Balakrishna).

ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేశాడు బాలయ్య. ఈ సినిమాకు వేటపాలెంట్ టైటిల్ అనుకుంటున్నారు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెకెక్కబోతున్న ఈసినిమా కోసం.. హైదరాబాద్ లో స్పెషల్ సెట్ కూడా వేశారని తెలుస్తోంది. మేజర్ షూటింగ్ అంతా కడప పరిసరప్రాంతాల్లో ప్లాన్ చేస్తున్నారు.  ఇక ఈ సినిమా తరువాత అనిల్ రావిపూడి బాలయ్య(Balakrishna)తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నాడు. కథ కూడా సిధ్ధం చేసుకున్నాడు.

అనిల్ రావిపూడి సినిమా జరుగుతుండగానే.. పూరీ జగన్నాథ్ తో కూడా సినిమాను సెట్స్ ఎక్కించబోతున్నాడు బాలకృష్ణ (Balakrishna). ఇక కొరటాల శివ కూడాబాలయ్యతో సినిమా కోసం లైన్ లో ఉన్నాడు. ఇలా వరుసగా డైరెక్టర్స్ ను లైన్ లో నిల్చోబెట్టిన బాలకృష్ణ.. మరో డైరెక్టర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.


బాలకృష్ణ(Balakrishna)ను దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలిసి ఒక కథ చెప్పాడనీ, ఆ కథ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ఈ సినిమాని దిల్ రాజు స్వయంగా నిర్మించబోతున్నట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ కథ బాలయ్య బాబుకి బాగా సూట్ అవుతుందంటూ.. దిల్ రాజు (Dil Raju) స్వయంగా శ్రీకాంత్ అడ్డాలను బాలయ్య దగ్గరకు పంపించాడట.  ఈ కథ బాలకృష్ణకు కూడా బాగా నచ్చడంతో చేద్దా అని చెప్పినట్టు తెలుస్తోంది.


ఇక వరుస ఫెయిల్యూర్స్ తో ఇబ్బంది పడుతున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల  ఆమధ్య నారప్ప సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. శ్రీకాంత్ అడ్డాల సినిమా ప్రయాణం మొదలైందే దిల్ రాజు( Dil Raju) నిర్మించిన కొత్త బంగారు లోకం తో. ఆ తరువాత ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు కూడా హిట్ కొట్టేసింది. వీరి కాంబినేషన్ కు హిట్ కాంబో అని టాక్ ఉంది.

అయితే  శ్రీకాంత్, బాలయ్య (Balakrishna) , దిల్ రాజు ముగ్గురిది రేర్ క్రేజీ కంబినేషన్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు పట్టాలపైకి వెళుతుందనే విషయంలోనే మాత్రం క్లారిటీ రావలసి ఉంది. ఈ కాంబినేషన్ పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రావల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios