బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు భారీ వసూళ్లను సాధించాయి. బాలకృష్ణ కెరియర్లోనే కొత్తరికార్డులను తిరగరాశాయి. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందనున్నట్టు తెలుస్తోంది. బాలకృష్ణ ఈ నెల 29నుంచి ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించిన షూటింగులో బిజీ అవుతారు. ఇక చరణ్ హీరోగా చేస్తోన్న సినిమాతో బోయపాటి తీరికలేకుండా వున్నారు.

దాదాపు ఈ రెండు సినిమాలు కూడా ఒకేసారి పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆ తరువాత బాలకృష్ణ - బోయపాటి సినిమా మొదలవుతుందని చెబుతున్నారు. బాలకృష్ణ పుట్టినరోజైన జూన్ 10వ తేదీన, ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగొచ్చని అంటున్నారు. ఈ సినిమాతో బాలయ్యకు .. బోయపాటికి హ్యాట్రిక్ హిట్ పడుతుందేమో చూడాలి.