ఒకే తెరపై ఇద్దరు హీరోలు కనిపిస్తే ఆడియెన్స్ ఎంతవరకు ఒప్పుకుంటారో తెలియదు గాని స్టార్ హీరోల్లో మాత్రం గుబులు ఎక్కువగానే ఉంటుంది. ఏ మాత్రం తేడా వచ్చినా అభిమానుల ఆలోచనలకూ అడ్డుకట్ట వేయడం చాలా కష్టం. అందుకే సౌత్ లో అంత ఈజీగా ఏ స్టార్ హీరో మల్టీస్టారర్ చేయడానికి ఇష్టపడరు. దర్శకులు కూడా అలాంటి కాన్సెప్ట్ లకు చాలావరకు దూరంగానే ఉంటారు. 

అయితే బయోపిక్ అనేసరికి వారసులను వెతుక్కుంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. మహానటి కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ గట్టిగా ప్రయత్నం చేశాడు. అయితే నాగచైతన్య ను తప్ప ఎన్టీఆర్ ను తీసుకురాలేకపోయాడు. ఇక ఇప్పుడు కృష్ణ గారి పాత్ర కోసం మహేష్ బాబును ఒప్పించడానికి ఎన్టీఆర్ టీమ్ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. 

అయితే బాలకృష్ణ ఈ విషయాన్నీ బాధ్యతగా తీసుకొని మహేష్ తో చర్చలు జరపడానికి ప్రయత్నం చేస్తున్నాడని గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే అప్పట్లో ఎన్టీఆర్ - కృష్ణకు కొన్ని విబేధాలు వచ్చాయి గనుక పాత్ర ఎలా ఉంటుంది అనే దానిపై కూడా రూమర్స్ వస్తున్నాయి. అయితే దర్శకుడు క్రిష్ అలాంటి విషయాలను సినిమాల్లో ఏమి చూపడనే టాక్ కూడా ఉంది. 

కేవలం ఎన్టీఆర్ - కృష్ణ ల సాన్నిహిత్యం గురించి చూపించాలని దర్శకుడు ఆలోచిస్తున్నాడట. ప్రస్తుతం మహేష్ మహర్షి షూటింగ్ తో విదేశాల్లో చాలా బిజీగా ఉన్నాడు. ఇక మరో రెండు రోజుల్లో హైదరాబాద్ కు రానుండగా బాలయ్య మహేషే ను స్పెషల్ కలవనున్నారని సమాచారం అందుతోంది. మరి ఇది ఎంతవరకు నిజమో గాని బాలకృష్ణతో - మహేష్ కనిపిస్తే స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్బ్ గా ఉంటుందని చెప్పవచ్చు.