గత కొద్ది రోజులుగా బాలకృష్ణ తదుపరి చిత్రం ఏం చేయబోతున్నారనే విషయమై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బోయపాటితో ఆయన సినిమా చేస్తారని కొద్ది సేపు, లేదు ..కాదు కె.ఎస్ రవి కుమార్ తోనే ముందుకు వెళ్తాడని మరికాస్సేపు డిస్కషన్ నడిచాయి. అసలు వీరిద్దరు కాకుండా కొత్త డైరక్టర్ ని ఎంకరేజ్ చేయబోతున్నాడని మరికొందరు కథనాలు రాసేసారు. ఆ రకంగా బాలయ్య  ఏ డైరక్టర్ తో సినిమా చేయబోతున్నారనేది పెద్ద సస్పెన్స్ సినిమాలా మారింది. అయితే ఆయన పుట్టిన రోజు పూట వీటిన్నటికీ పుల్ స్టాప్ పెట్టేసాడు. అనఫిషీయల్ గా సినిమాను ప్రకటించాడు.

బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన్ను ప్రత్యేకంగా విష్ చేయడానికి నిర్మాత సి కళ్యాణ్ దర్శకుడు కెఎస్ రవికుమార్ వెళ్లడం వల్ల మీడియా జనాలకి పూర్తిగా క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం లాంచింగ్  మరో రెండు రోజుల్లో అంటే 13న జరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది . ఈ సినిమా కోసమే కొద్దిరోజులుగా బాగా గెడ్డం పెంచుతున్నారు. ఈ  సినిమాలో  బాలయ్య పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నారు. జగపతిబాబు విలన్ గా, హీరొయిన్స్ గా మేహ్రీన్ పాయల్ రాజ్ పుత్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సంక్రాంతి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. 

ఇక బోయపాటి సినిమా విషయానికి వస్తే బడ్జెట్టే పెద్ద అవరోధంగా మారిందని తెలుస్తోంది. 65 కోట్ల బడ్జెట్ తో సినిమా అంటే ఏ నిర్మాత ఉత్సాహం చూపించటం లేదు. అంతకు తక్కువ బడ్జెట్ అంటే తను చేయలేనని బోయపాటి చేతులెత్తేసారు. రామ్ చరణ్ తో చేసిన  వినయ విధేయ రామ రిజల్ట్ తో  పరిస్దితి లు ఇలా మారిపోయాయి. దాంతో కొద్దిగా కూడా  ఫాంలో లేని రవికుమార్ కు అవకాసం వచ్చింది.