కథానాయకుడు - మహానాయకుడు సినిమాలతో ఊహించని విధంగా నెగిటివ్ టాక్ అందుకున్న బాలకృష్ణ నెక్స్ట్ ప్రాజెక్టులపై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. స్క్రిప్ట్ నుంచి క్యారెక్టర్ డిజైనింగ్ వరకు అన్ని విషయాల్లో కేర్ తీసుకుంటున్నారు. కెఎస్ రవికుమార్ డైరెక్షన్ లో బాలకృష్ణ ఒక స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 

ఆ సినిమాతో ఎలాగైనా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇప్పటికే సినిమా షూటింగ్ సగానికి చేరుకుంది. ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా షెడ్యూల్స్ ని త్వరత్వరగా ఫినిష్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీలో బాలయ్య ఫుల్ యాక్షన్ మోడ్ కనిపించనున్నాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ కోసం చిత్ర యూనిట్ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. 

ఈ సీన్స్ లో బాలకృష్ణ హైలెట్ గా నిలుస్తాడని ఫ్యాన్స్ విజిల్స్ తో మోత మోగించేలా దర్శకుడు ఫైట్ మాస్టర్స్ యాక్షన్ సీన్స్ ని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.