Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య సినిమాకు త్రివిక్రమ్ సహకారం?

 టాలీవుడ్ లో వెలుగుతున్న మరో టాప్ బేనర్లో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. హారిక అండ్ హాసిని బేనర్లో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. 

Balakrishna in Harika Haasini Banner jsp
Author
Hyderabad, First Published Jul 23, 2021, 7:00 AM IST

నందమూరి బాలకృష్ణ లో గత కొంతకాలంగా మార్పు కనిపిస్తోంది. స్టార్ డైరెక్టర్లతో, హ్యాపెనింగ్ బేనర్లతో జట్టు కట్టడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ బేనర్లో గోపీచంద్ మలినేని హీరోగా బాలయ్య ఓ సినిమాకు ఓకే చెప్పారు. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లనుంది. అలాగే అనిల్ రావిపూడితో ఓ సినిమా చేయడానికి కూడా బాలయ్య రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం స్టోరీ డిస్కషన్స్ నడుస్తున్నాయి. అనిల్‌తో తన సినిమా ఉంటుందని రీసెంట్ గా  తన పుట్టిన రోజు సందర్భంగా బాలయ్యే స్వయంగా ధ్రువీకరించారు.

 ఇప్పుడు టాలీవుడ్ లో వెలుగుతున్న మరో టాప్ బేనర్లో సినిమా చేయడానికి బాలయ్య రెడీ అయిపోయాడు. హారిక అండ్ హాసిని బేనర్లో బాలయ్య సినిమా చేయబోతున్నాడు. ఆ బ్యానర్ మరేదో కాదు..హారిక అండ్ హాసిని. ‘ఆదిత్య 369’ చిత్రానికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బాలయ్య టీవీ ఛానెళ్లకు ఇంటర్వ్యూలిచ్చినప్పుడు ఈ విషయం రివీల్ చేసారు.  తన ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వివరిస్తూ హారిక అండ్ హాసిని బేనర్లో సినిమా చేయబోతున్నట్లు బాలయ్య వెల్లడించాడు. 

ఇక ఈ బ్యానర్ కు అన్ని తానే వ్యవహిస్తూంటారు త్రివిక్రమ్. ఓ రకంగా ఇది త్రివిక్రమ్ కు ఆస్దాన నిర్మాణ సంస్ద. అంటే బాలయ్య చేసే సినిమా స్క్ర్రిప్టు ఖచ్చితంగా త్రివిక్రమ్ దగ్గరకు వెళ్ళుతుంది. ఆయన సూచనలు, సలహాలు కూడా ఉంటాయనటంలో సందేహం లేదు. అయితే డైరక్టర్ ఎవరనేది మాత్రం తెలియరాలేదు. 

ప్రెజెంట్ బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. జూలై నుంచి నెల రోజుల పాటు గండిపేటలో ఈ సినిమా క్లైమాక్స్‌ను షూట్‌ చేయనున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య వరుసగా కొత్త కాంబినేషన్స్‌తో ఆడియన్స్‌ ముందుకు వస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ చిత్రాన్ని చేస్తున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున ఈ సినిమాను నిర్మిస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios