ఎన్టీఆర్ బయోపిక్ ఆపేస్తారా..?

balakrishna in confusion about ntr biopic
Highlights

దివంగత ఎన్టీఆర్ జీవిత చిరిత్రతో బాలకృష్ణ బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నాడు

దివంగత ఎన్టీఆర్ జీవిత చిరిత్రతో బాలకృష్ణ బయోపిక్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ సినిమాకు స్క్రిప్ట్ మొత్తం సిద్ధం చేసి పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించాడు. ఈ సినిమా ఓపెనింగ్ కు ఉపరాష్ట్రపతి కూడా వచ్చారు. అలాంటిది ఇప్పుడు ఈ సినిమా ఆపేయాలని ఆలోచిస్తున్నాడట బాలయ్య. బయోపిక్ చేయడం అనుకున్నంత సులువైన పని కాదు.. పైగా దర్శకుడు తేజ సినిమా నుండి తప్పుకోవడం మరెవరూ కూడా డైరెక్టర్ గా చేయడానికి ముందుకు రాకపోవడం వంటి విషయాలను బాలయ్యను ఆలోచనల్లోకి నెట్టేస్తున్నాయి.

కాస్టింగ్ విషయం కూడా ఓ కొలిక్కి రాలేదు. బాలయ్య తప్ప మిగిలిన పాత్రలు ఎవరు పోషిస్తున్నారో ఇప్పటికీ క్లారిటీ లేదు. పైగా తాజాగా బాలయ్య.. వినాయక్ సినిమా ఒప్పుకున్నాడు. దీనికి కారణంగా బయోపిక్ మరింత ఆలస్యమవుతుంది. ఓ పక్క బయోపిక్ ఆపేయాలని అనిపిస్తున్నా.. తన ఇమేజ్ కు నష్టం వాటిల్లుతుందని ఆలోచిస్తున్నారట.

గతంలో కూడా ఆయన 'నర్తనశాల' సినిమాను మొదలుపెట్టి మధ్యలోనే ఆపేశారు. ఆప్పుడు బయోపిక్ కూడా వదిలేస్తే దానికి కారణాలు ఎప్పటికీ చెబుతూనే ఉండాలి. మొండిగా సినిమా చేద్దామా..? లేక ఆపేద్దామా..? అనే ఆలోచనలతో సతమతమవుతున్నాడని సమాచారం. మరి ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి!

loader