నందమూరి అభిమానులు మాత్రమే కాదు..సినిమా ప్రియులందరి దృష్టి ఇప్పుడు 'ఎన్టీఆర్' బయోపిక్ పైనే వుందన్న సంగతి తెలిసిందే.  దర్శకుడు క్రిష్ ..ఈ సినిమాకు చెందిన ఎప్పటికప్పుడు లేటెస్ట్  ఫొటోలు రిలీజ్ చేస్తూ హల్ చల్ సృష్టిస్తున్నారు. దానికి తోడు ఈ సినిమాలో   విశేషాలుకు చెందిన వార్తలు మీడియాకు ఉప్పందుతూనే ఉంది. తాజాగా చిత్రం టీమ్ విడుదల చేసిన మన్యం వీరుడు గెటప్ లో బాలయ్య  ఫొటో ...ఇప్పుడు అంతటా హాట్ టాపిక్ గా మారింది. 

ఆంగ్లేయుల పాలనపై అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అల్లూరి సీతారామరాజు.  అప్పట్లో ఆయన జీవిత కథతో  సూపర్ స్టార్ కృష్ణ `అల్లూరి సీతారామరాజు` అనే సినిమా తీసి పెద్ద  హిట్ కొట్టారు.  ఎంతలా అంటే  అల్లూరి అనగానే కృష్ణ పేరే గుర్తుకొస్తుంది అభిమానులకు.   అయితే అల్లూరి సీతారామరాజు పాత్రను అప్పుడు ఎన్టీఆర్ వెయ్యాలని అనుకున్నారు కానీ విరమించుకుని తర్వాత మోజర్ చంద్రకాంత్ లో కనిపించారు. 

ఇప్పుడు అల్లూరి స్ఫూర్తిని మరోసారి ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ అల్లూరి సీతారామరాజు గెటప్ తో ఆవిష్కరించారు.   అల్లూరి సీతారామరాజు లుక్ లో బాలకృష్ణ ఫెంటాస్టిక్ గా కనిపిస్తున్నారని మీడియా, అబిమానులు అంటున్నారు.   ఈ లుక్ కోసం క్రిష్ చాలా శ్రద్ధ తీసుకున్నారని అర్దమవుతోంది.  

విద్య బాలన్, రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో 66 గెటప్స్ లో కనిపిస్తాడని సమాచారం.