జూనియర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కి తారక్ కి మధ్య గ్యాప్ రావడంతో బాలయ్యకి హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని అంటుంటారు. వాటికి బలాన్ని చేకూరుస్తూ.. హరికృష్ణకి, ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ బాగా తగ్గించారు.

జూనియర్ ఎన్టీఆర్ కి, బాలకృష్ణకి మధ్య విబేధాలు ఉన్న సంగతి తెలిసిందే. లోకేష్ కి తారక్ కి మధ్య గ్యాప్ రావడంతో బాలయ్యకి హరికృష్ణ ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగిందని అంటుంటారు. వాటికి బలాన్ని చేకూరుస్తూ.. హరికృష్ణకి, ఎన్టీఆర్ కి తెలుగుదేశం పార్టీలో ప్రయారిటీ బాగా తగ్గించారు.

బాబాయ్, అబ్బాయ్ ల మధ్య గ్యాప్ మరింత పెరుగుతూనే వచ్చింది. బాలయ్య సినిమాల గురించి కానీ, ఆయన ఇప్పుడు నటిస్తోన్న ఎన్టీఆర్ బయోపిక్ గురించి కానీ ఎన్టీఆర్ ఎక్కడా.. ఒక్క కామెంట్ కూడా చేయలేదు. ఇంతలోనే ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ మరణించారు.

వెంటనే బాలకృష్ణ, చంద్రబాబు నాయుడు, లోకేష్ అందరూ ఎన్టీఆర్ తో కలిశారు. అంత్యక్రియలు పూర్తయినంత వరకు ఎన్టీఆర్ తో కలిసే ఉన్నారు. ఈ సందర్భంగా వారు కలిసి ఉన్న కొన్ని వీడియోలు కూడా బయటకి వచ్చాయి. ఎన్టీఆర్ 'అరవింద సమేత' ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా బాలయ్య అతిథిగా వస్తారని వార్తలు వినిపించాయి. ఈ వేడుక ఆంధ్రప్రదేశ్ లో ఉంటుందని కూడా అన్నారు.

కానీ అవేవీ జరగలేదు. బాలయ్య వేడుకకి కూడా హాజరు కాలేదు. దీంతో వారి మధ్య గొడవలు సమసిపోలేదని అభిమానులు అంటున్నారు. ఎన్టీఆర్ కూడా తన ఎమోషనల్ స్పీచ్ లో బాలయ్య పేరు ఎక్కడా తీసుకురాలేదు. తన తండ్రి చనిపోయి బాధలో ఉన్న సమయంలో తనకు త్రివిక్రమ్ మాత్రమే తోడుగా ఉన్నాడంటూ చెప్పుకొచ్చాడు. దీంతో బాలయ్య, ఎన్టీఆర్ ల మధ్య విబేధాలు అలానే ఉన్నాయని అంటున్నారు. 

ఇవి కూడా చదవండి.. 

ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్.. 'అరవింద'కి పెరిగిన షోలు!

'అరవింద సమేత'పై మహేష్ బాబు కన్ను!

'అరవింద సమేత'కి పవన్ ఫ్యాన్స్ సపోర్ట్.. కారణమదేనా..?

'అరవింద సమేత'లో నో ఫన్.. ఓన్లీ యాక్షన్!

'అరవింద సమేత' ట్రైలర్.. యూట్యూబ్ లో రికార్డుల మోత!

ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై 'అరవింద సమేత' హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

మా నాన్నకిచ్చిన మాట మీకిస్తున్నా.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్!