Balayya New Movie Title: `వీరసింహారెడ్డి`గా బాలకృష్ణ.. ఈ సారి `అఖండ`ని మించిన మోత మోగబోతుందా?
`రెడ్డి` అనేది కూడా బాలయ్య సక్సెస్‌ఫుల్ టైటిల్. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `సమరసింహారెడ్డి`, `చెన్నకేశవ రెడ్డి` మంచి విజయాలను సాధించాయి. తాజాగా ఇదే సెంటిమెంట్‌ని బాలయ్య ఫాలో అవుతున్నారట. `సింహ`, `రెడ్డి` కలిపి వచ్చేలా కొత్త సినిమాకి టైటిల్‌ని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది.
బాలకృష్ణ(Balakrishna) కెరీర్‌లో `సింహా`(Simha) అనేది సెంటిమెంట్. `సింహా` టైటిల్స్ తో వచ్చిన సినిమాలన్నీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించాయి. బాలకృష్ణని కూడా అభిమానులు ముద్దుగా `నటసింహా` అని పిలుచుకుంటారు. అన్ని రకాలుగా సింహా అనేది బాలయ్య(Balayya)కి కలిసొచ్చే అంశం. అంతేకాదు సింహా తో కూడిన సినిమా టైటిల్ ఉందంటే బాలయ్యనే ఠక్కున గుర్తొస్తారు. బాలయ్యకి సక్సెస్‌లు కూడా తీసుకొచ్చిన టైటిల్స్ ఇవి. దీనికి తోడు `రెడ్డి` అనేది కూడా బాలయ్య సక్సెస్‌ఫుల్ టైటిల్. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన `సమరసింహారెడ్డి`, `చెన్నకేశవ రెడ్డి` మంచి విజయాలను సాధించాయి.
తాజాగా ఇదే సెంటిమెంట్‌ని బాలయ్య ఫాలో అవుతున్నారట. `సింహ`, `రెడ్డి` కలిపి వచ్చేలా కొత్త సినిమాకి టైటిల్‌ని పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో `ఎన్‌బీకే 107`(NBK 107) చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే ఇది రెగ్యూలర్ షూటింగ్‌ని ప్రారంభించుకుంది. సిరిసిల్లలో ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రానికి `వీరసింహారెడ్డి` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. NBK 107 సినిమాలో బాలకృష్ణ పాత్ర పేరు వీరిసింహారెడ్డి అని, పాత్ర పేరునే టైటిల్‌గా పెట్టాలనుకుంటున్నారట. పాత్రపేరు పవర్‌ఫుల్‌గా ఉండటంతో దాన్నే టైటిల్‌గా ఖరారు చేసే ఆలోచనలో ఉందట.
దీనిపై బాలకృష్ణ సైతం తన ఆసక్తిని వెల్లడించారని, బాలయ్య చెబితే ఇంకా తిరుగేముంటుంది. దర్శకుడు ఫిక్స్ అయిపోవాల్సిందే. దీంతో బాలయ్య-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాకి `వీరసింహారెడ్డి` అనే టైటిల్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారుతుంది. మరి ఇందులో నిజమెంతా తెలియాల్సింది. కానీ ఈ వార్త బాలయ్య అభిమానులను ఆద్యంతం అలరిస్తుంది. ఇదిలా ఉంటే ఈ చిత్రంలోని బాలయ్య లుక్ లీక్ అయ్యింది. చైర్‌లో పెద్ద మనిషి తరహాలో బాలయ్య కూర్చొని ఉండగా, వెనకాల కారు వద్ద తన సహాయకుడు నిల్చొని ఉన్న లుక్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. బాలయ్య పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండబోతుందని తెలుస్తుంది.
అయితే ఈ సినిమా తమిళంలో సక్సెస్ సాధించిన ఓ చిత్రానికి రీమేక్ అనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇది కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ చిత్రానికి కాపీలా ఉందని, ఇటీవల లీక్ అయిన ఫోటోని బట్టి నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శివరాజ్‌కుమార్ నటించిన `మఫ్టీ` చిత్రంలోని ఓ సీన్‌ని పోలి ఉందని కంపేరిజన్ ఫోటోలు కూడా జోడించి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తుండటం విశేషం. గోపీచంద్.. కన్నడ సినిమాని కాపీ కొడుతున్నాడా? అనే కామెంట్లు వినిపిస్తుండగా, ఈ చిత్ర రీమేక్ రైట్స్ ని తీసుకున్న దర్శకుడు గోపీచంద్ సైలెంట్‌గా రీమేక్ చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తుంది. అయితే ఇందులో నిజం లేదనేది గోపీచంద్ బృందం నుంచి వస్తోన్న వాదన. మరి నిజనిజాలు మున్ముందు తేలనున్నాయి.
ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. మైత్రీమూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు దునియా విజయ్ విలన్ పాత్రని పోషిస్తున్నారు. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇటీవల బాలయ్య.. `అఖండ` చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్నారు. తన కెరీర్‌లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అదే జోష్‌తో గోపీచంద్ చిత్రంలో నటిస్తున్నారు బాలయ్య.