Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య ఫ్యాన్స్ డిజప్పాయింట్‌ అయ్యే వార్త చెప్పిన అనిల్‌ రావిపూడి.. `భగవంత్‌ కేసరి`లో అవి ఉండవట.. పెద్ద రిస్కే

బాలయ్య నటించిన `భగవంత్‌ కేసరి` నుంచి ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. డైలాగ్‌లు బాగున్నాయి. కానీ బాలయ్య రేంజ్‌ స్టఫ్‌ని చూపించలేదనే కామెంట్స్ వస్తున్నాయి. 

balakrishna fans worry about bhagavanth kesari after anil ravipudi comments ? arj
Author
First Published Oct 14, 2023, 7:18 PM IST

నందమూరి నటసింహాం బాలకృష్ణ బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు హిట్ల తర్వాత హ్యాట్రిక్‌ హిట్‌ కోసం రెడీ అవుతున్నారు. ఆయన ఈ దసరా పండక్కి `భగవంత్‌ కేసరి` చిత్రంతో వస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రాల దర్శకుడు అనిల్‌ రావిపూడి రూపొందించిన చిత్రమిది. కాజల్‌ కథానాయికగా నటిస్తుండగా, శ్రీలీల ఆయన కూతురుగా నటిస్తుంది. ఈ చిత్రం ఈ నెల 19న రిలీజ్‌ కాబోతుంది. 

ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌ ఆకట్టుకున్నాయి. డైలాగ్‌లు బాగున్నాయి. కానీ బాలయ్య రేంజ్‌ స్టఫ్‌ని చూపించలేదనే కామెంట్స్ వస్తున్నాయి. దీనికితోడు ఈ సినిమా మరో ఐదు రోజుల్లో రిలీజ్‌ కాబోతుంది, కానీ బజ్‌ మాత్రం లేదు. `అఖండ`, `వీరసింహారెడ్డి` చిత్రాల రేంజ్‌ బజ్‌ దీనికి రావడం లేదు. ట్రైలర్‌లో బాలయ్య మార్క్ కనిపించడం లేదనే టాక్‌ ఉంది. దీనికితోడు గత చిత్రాలు మాస్‌ యాక్షన్‌ మూవీస్‌. ఇందులో ఆ మాస్‌, యాక్షన్‌ పాళ్లు తగ్గినట్టుగా అనిపిస్తుంది. దీంతో ఆ బజ్‌ లేదు. అంతేకాదు ఇంకా చాలా చోట్ల బిజినెస్‌ కాలేదని సమాచారం. ఏపీలో చాలా ఏరియాలో కొనేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని ట్రేడ్‌ వర్గాల సమాచారం. 

దీంతో సినిమాపై హైప్‌ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. బాలయ్య సెకండ్‌ రోల్‌ అదిరిపోతుందని, పోలీస్‌గా కనిపిస్తారని అంటున్నారు. ఇంటర్వెల్‌ నెక్ట్స్ లెవల్‌ లో ఉంటుందని ఊదరగొడుతున్నారు. కానీ తాజాగా దర్శకుడు అనిల్‌ రావిపూడి చేసిన కామెంట్లు ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉన్న హైప్స్ ని కూడా తగ్గించేలా ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య మార్క్ ఎలిమెంట్లు చాలా తక్కువగానే ఉన్నాయన్నారు. కేవలం మూడంటే మూడే ఫైట్లు ఉంటాయట. ఫస్టాఫ్‌లో ఒకటి ఇంటర్వెల్‌లో ఒకటి, క్లైమాక్స్ లో మరోటి ఉంటుందట. ఒకటి రెండు యాక్షన్‌ బ్లాక్స్ ఉంటాయని, అవి ఫైట్స్ మాత్రం కావన్నారు. ఇందులో బాలయ్యది ద్విపాత్రాభినయం కాదన్నారు. ఆయన పాత్రలో రెండు మూడు షేడ్స్ ఉంటాయని తెలిపారు.

సినిమాలో ఇతర ఎమోషన్స్ ఉంటాయట. వినోదంతోపాటు ఎమోషన్స్‌ మిక్స్ చేసి తెరకెక్కించినట్టు తెలిపారు. బాలయ్యని ఓ కొత్త స్టయిల్‌లో చూపిస్తున్నట్టు వెల్లడించారు. దీన్ని బాలయ్య కూడా ఛాలెంజ్‌గా తీసుకుని చేశారట. అయితే ఇదే ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్ ని కలవరపెడుతుంది. ఆయన ఈ పదేళ్లలో సినిమాలు చూస్తే, కేవలం మాస్‌, యాక్షన్‌ మూవీస్‌ మాత్రమే ఆడాయి. `అఖండ`కి ముందు `లెజెండ్‌` తర్వాత ఆయనకు హిట్‌ లేదు. `గౌతమిపుత్ర శాతకర్ణి` కూడా యావరేజ్‌గానే ఆడింది. అది కూడా సంక్రాంతి పండక్కి కాబట్టి ఆమాత్రం చేసింది. 

భిన్నంగా ప్రయత్నించిన, ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫ్యామిలీ సెంటిమెంట్స్ అంటూ ప్రయత్నించిన `లయన్‌`, `డిక్టేటర్‌`, `పైసా వసూల్‌`, `జై సింహా`, `ఎన్టీఆర్‌` బయోపిక్‌, `రూలర్‌` చిత్రాలన్నీ బిగ్గెస్ట్‌ డిజాస్టర్స్. ఇక `లెజెండ్‌`కి ముందు `సింహా` వరకు హిట్‌ లేదు. ఆ సమయంలో వచ్చిన `పరమ వీర చక్ర`, `శ్రీరామరాజ్యం`, `అధినాయకుడు`, `శ్రీమన్నారాయణ`, `ఊకొడతారా ఉలిక్కి పడతారా? చిత్రాలు కూడా పరాజయం చెందాయి. అంతేకాదు అంతకు ముందు `మిత్రుడు`, `పాండురంగడు`, `మహారథి`, `వీరభద్ర`, `అల్లరి పిడుగు`, `విజయేంద్రవర్మ` చిత్రాలు కూడా డిజప్పాయింట్‌ చేశాయి.

ఇటీవల 13ఏళ్లలో బోయపాటి శ్రీను ఇచ్చిన మూడు సినిమాలే హిట్లు. `సింహా`, `లెజెండ్‌`, `అఖండ` పూర్తిగా బోయపాటి మార్క్ యాక్షన్‌ తో సాగుతాయి. బీజీఎం మోత, బాలయ్య మార్క్ మాస్‌ డైలాగ్‌లతో హోరెత్తిపోతాయి. అదే ఆయన అభిమానులకు కిక్కునిచ్చే అంశం. గత చిత్రం `వీరసింహారెడ్డి` కూడా అదే స్టయిల్‌లో ఉండటంతో సక్సెస్‌ అయ్యింది. పైగా సంక్రాంతి కావడంతో దుమ్ములేపింది. కానీ ఇప్పుడు బాలయ్యకి అసలు పరీక్ష ఎదురు కాబోతుంది. తన మార్క్ మాస్‌, యాక్షన్స్ లేకుండా వస్తున్న ఈ చిత్రం ఏమేరకు ఆకట్టుకుంటుంది? అనేది పెద్ద ప్రశ్న. ఈ లెక్కల్లో భాగంగానే ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. తాజాగా అనిల్‌ రావిపూడి కామెంట్లతో అది మరింత పెరిగింది. ఈ చిత్రానికి థమన్‌ సంగీతం అందిస్తున్నారు. గత రెండు చిత్రాలు ఆయన బీజీఎంతోనే ఆడాయి. మరి ఈ చిత్రాన్ని కూడా ఆయన నిలబెడతాడా? చూడాలి. 
 

Follow Us:
Download App:
  • android
  • ios