దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ‘వినయ విధేయ రామ’ సినిమా డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అలాగే  ‘యన్‌.టి.ఆర్‌’ తొలి భాగం ‘కథానాయకుడు’ సంక్రాంతి సందర్భంగా విడుదలై,  డిజాస్టర్ టాక్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో వీరిద్దరి కాంబినేషన్ అంటే భాక్సాఫీస్ వద్ద ఇంతకు ముందు వచ్చినంత క్రేజ్ మాత్రం  క్రియేట్ కాదు.  ఈ విషయం గమనించిన బాలయ్య ..బోయపాటి కొన్ని కండీషన్స్, రిస్ట్రిక్షన్స్ పెట్టారట. ముఖ్యంగా సినిమా మొత్తం ఇరవై కోట్ల బడ్జెట్ లోనే పూర్తి చేయాలని చెప్పారట. 

అలాగే తామిద్దరం రెమ్యునేషన్స్ ఇప్పుడు తీసుకోకుండా రిలీజ్ తర్వాత  షేర్ క్రింద తీసుకుందామని ప్రపోజల్ పెట్టారట. బోయపాటి కు ఈ కండీషన్స్ నచ్చక పోయినా తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే బాలకృష్ణే ఫెరఫెక్ట్ ఆప్షన్ అని మారు మాట్లాడకుండా ఓకే చేసినట్లు సమాచారం.  ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో ‘సింహా’, ‘లెజెండ్‌’ సినిమాలు వచ్చాయి. ఈ రెండూ ఘన విజయం సాధించాయి. దీంతో బోయపాటి-బాలయ్య కాంబినేషన్‌ అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్  అనే మార్క్‌ ఏర్పడింది.

ఈ మేరకు అభిమానుల అంచనాలను అందుకోవాలని  మరో హిట్‌ కొట్టాలని బోయపాటి స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట. ఆసక్తికరమైన కథను రెడీ చేసే పనిలోపడ్డారట. ఈ సినిమా ఆశించిన విజయం సాధిస్తే బోయపాటి-బాలయ్య హ్యాట్రిక్‌ కొట్టినట్లే. మరి వీరి కలయికలో వచ్చే ఈ కొత్త సినిమా ఎలా ఉంటుందో తెలియాలంటే ఎదురుచూడాల్సిందే. ఇంకా ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

బాలకృష్ణ ప్రస్తుతం ‘యన్‌.టి.ఆర్‌’ రెండో భాగం ‘మహానాయకుడు’ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. క్రిష్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 22న చిత్రాన్ని విడుదలకాబోతోంది.  ఈ సినిమా రిజల్ట్ సైతం బోయపాటి సినిమాపై ఇంపాక్ట్ కలగచేస్తుంది.