ఎన్టీఆర్ బయోపిక్ తో ప్రస్తుతం బిజీగా ఉన్న బాలయ్య నెక్స్ట్ ప్రాజెక్ట్ బోయపాటి డైరెక్షన్ లో  చేయనున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు సంబందించిన ఓ రూమర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. గతంలో బాలకృష్ణ అనేక సినిమాల్లో డ్యూయల్ రోల్స్ లో నటించిన సంగతి తెలిసిందే. బోయపాటి కూడా బాలయ్యతో అలాంటి సినిమాలే చేశాడు. 

ఇక రెండు విభిన్నమైన పాత్రల్లో బోయపాటి తన నెక్స్ట్ సినిమాలో బాలకృష్ణను చూపించనున్నట్లు తెలుస్తోంది. ఎమోషన్ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాలో హైలెట్ గా నిలుస్తాయని అలాగే సినిమాలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ట్విస్ట్ అభిమానుల అంచనాలకు అందుకునేలా ఉంటుందని టాక్. 

అయితే వినయ విధేయ రామ సినిమాలో కొన్ని సీన్స్ పై విమర్శలు రావడంతో నెక్స్ట్ అలాంటి పొరపాట్లు జరగకుండా సీన్స్ విషయంలో అతి చేయకుండా బోయపాటి స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాడట. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. మహానాయకుడు రిలీజ్ అనంతరం బోయపాటి తో బాలకృష్ణ కలవనున్నాడు.