బాలకృష్ణ గాడ్‌ ఫాదర్‌లా మారబోతున్నాడా? తాను గాడ్‌ ఫాదర్‌గాని శాషించబోతున్నాడా? గాడ్‌ ఫాదర్‌గా కొత్త ట్రెండ్‌ సెట్‌ చేయబోతున్నాడా? అంటే అవుననే వార్తలు సోషల్‌ మీడియా నుంచి వినిపిస్తున్నాయి. మరి బాలయ్య `గాడ్‌ ఫాదర్‌`గా మారడమేంటనేది చూస్తే.. ప్రస్తుతం ఆయన బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. `సింహా`, `లెజెండ్‌` తర్వాత వీరి కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రమిది. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మిస్తున్నారు. 

ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇందులో ప్రగ్యా జైశ్వాల్‌ ఓ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓ పాత్రలో అఘోరాగా కనిపిస్తారనే వార్త చాలా రోజులుగా చక్కర్లు కొడుతుంది. దాదాపు ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. మే 28న విడుదలకు రెడీ అవుతుంది. ఈ నేపథ్యంలో ఇంకా సినిమా టైటిల్‌ని ఖరారు చేయలేదు. 

ఇంకా టైటిల్‌ నిర్ణయించకపోవడంపై అభిమానులు అసంతృప్తితో ఉన్నారు. దీనికి పలు పేర్లు ఆ మధ్య సోషల్‌ మీడియాలో వినిపించాయి. కానీ ఏది కన్ఫమ్‌ కాలేదు. ఈ క్రమంలో తాజాగా ఓ పవర్‌ఫుల్‌ నేమ్‌ని చిత్ర బృందం ఆలోచిస్తున్నారట. బాలకృష్ణ అంటేనే పవర్‌ఫుల్‌ నేమ్స్ కి కేరాఫ్‌. ముఖ్యంగా సినిమా ఎలా ఉన్నా, టైటిల్‌కి బలంగా, మాస్‌గా ఉండేలా చేసుకుంటారు. ఇప్పుడు అదిరిపోయే టైటిల్‌ని అనుకుంటున్నారట. దీనికి `గాడ్‌ఫాదర్‌` అనే పేరుని పరిశీలిస్తున్నట్టు ప్రస్తుతం ఓ వార్త చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. మాఫియా నేపథ్యంలో హాలీవుడ్‌లో `గాడ్‌ఫాదర్‌` సినిమా వచ్చి ట్రెండ్‌ సెట్‌ చేసిన విషయం తెలిసిందే. మరి బాలకృష్ణ ట్రెండ్‌ సెట్టర్‌ అవుతాడా? అనేది చూడాలి. కానీ ఈ టైటిల్‌ విషయంలో బాలయ్య అభిమానులు మాత్రం ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.