బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని డైరక్టర్ పూర్తి మాస్ ఎలిమెంట్స్ తో  కథ సిద్ధం చేస్తున్నారట. చిరు తో సినిమా చేసేటప్పటి నుంచే బాలయ్య తోను సినిమా చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.  


నిజమా ...కాదా అని గత కొద్ది రోజులుగా ఫిల్మ్ నగర్ లో జరుగుతున్న చర్చలకు ఫుల్ స్టాప్ పడనుంది. అనిల్ రావిపూడి తో చేస్తున సినిమా సెట్స్ పై ఉంటుండగానే.. తదుపరి సినిమా ఖరారు అయ్యింది. దర్శకుడు బాబిని తన తదుపరి చిత్రానికి ఫైనలైజ్ చేసారు. ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాత నాగ వంశీ అఫీషియల్ గానే ప్రకటించారు. జూన్ 10 న బాలయ్య పుట్టిన రోజు సందర్బంగా అఫీషియల్ ఎనౌన్సెంట్ అన్నట్లు క్లూ ఇచ్చారు. ఆ రోజు ఈ ప్రాజెక్టు పూజ కార్యక్రమాలతో మొదలు కానుందని సమాచారం.

Scroll to load tweet…

ఈ సంక్రాంతికి చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి సూపర్ హిట్ ఇచ్చాడు బాబి. ఆ చిత్రంతో తన టాలెంట్ చూపించాడు. మరీ ముఖ్యంగా సీనియర్ హీరోని వింటేజ్ లుక్ లో చూపించడంలో సూపర్ సక్సెస్ అయ్యాడు. మెగా ఫ్యాన్స్ అందరికీ దగ్గరయ్యాడు. దాంతో ఈ దర్శకుడుతో సినిమా చేయటానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. గత కొంతకాలంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. బాలయ్య ఇమేజ్ ని దృష్టిలో ఉంచుకొని బాబి కథ సిద్ధం చేస్తున్నారట. చిరు తో సినిమా చేసేటప్పటి నుంచే బాలయ్య తోను సినిమా చేస్తారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.

అయితే.. బాలయ్య 109వ సినిమా మాత్రం బాబితో ఉండకపోవచ్చు. ఎందుకంటే.. ప్రస్తుతం చేస్తున్న అనిల్ రావిపూడి సినిమా పూర్తయిన వెంటనే, బోయపాటితో కలిసి మరోసారి సెట్స్ పైకి వెళ్తున్నాడు బాలయ్య. బోయపాటి సినిమా తర్వాతే బాబి మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఈ గ్యాప్ లో బాబి, తన కథకు మరిన్ని మెరుగులు దిద్దుకోవచ్చు. బాల‌య్య ప్ర‌స్తుతం అనిల్ రావిపూడి సినిమాతో బిజీగా ఉన్నాడు. ఆ వెంట‌నే బోయ‌పాటి సినిమా మొద‌ల‌వుతుంది. బోయ‌పాటి సినిమాతో పాటుగా స‌మాంత‌రంగా బాబి సినిమానీ మొద‌లెట్టే అవ‌కాశాలు ఉన్నాయి. 

బాబీ బాలయ్య కాంబినేషన్ బాక్సాఫీస్ ను ఏ రేంజ్ లో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది. బాలయ్య ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రాజెక్ట్ లను పూర్తి చేస్తే మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంటుంది. బాలయ్య రెమ్యునరేషన్ 20 కోట్ల రూపాయల నుంచి 25 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండగా వరుస ప్రాజెక్ట్ లతో బాలయ్య కెరీర్ పరంగా బిజీగా ఉన్నారు.