బాలకృష్ణ పుట్టిన రోజుని పురస్కరించుకుని ఆయన నటిస్తున్న `ఎన్బీకే 109` చిత్రం నుంచి గ్లింప్స్ వచ్చింది. ఆ నయా గ్లింప్స్ ఎలా ఉందంటే? 

బాలకృష్ణ ఈ బర్త్ డే సందర్భంగా తన అభిమానులకు డబుల్‌ ట్రీట్‌ ఇచ్చాడు. మార్నింగ్‌ బోయపాటి శ్రీనుతో చేయాల్సిన సినిమా ప్రకటన వచ్చింది. సినిమాని ప్రకటిస్తూ పోస్టర్‌ని విడుదల చేశారు. `అఖండ` తరహాలోనే అది ఉండబోతుందని చెప్పకనేచెప్పారు. ఇప్పుడు మరో ట్రీట్‌ వచ్చింది. బాబీ దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న `ఎన్బీకే109` గ్లింప్స్ వచ్చింది. సుమారు నిమిషం పాటు సాగే ఈ గ్లింప్స్ అదిరిపోయేలా ఉంది. బాలయ్య పాత్ర ఎలివేషన్‌ చూపించేలా ఈ గ్లింప్స్ సాగింది. 

ఇందులో రాత్రి సమయంలో మంచు పొగలో విలన్లు కత్తులు పట్టుకుని ఎవరినే వేటాడటానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో `దేవుడు మంచి వాడయ్యా.. దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ల అంతూ చూడాలంటే కావాల్సింది జాలి, దయా, కరుణ, ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడు` అంటూ మకరంద్‌ దేశ్‌ పాండే చెబుతుంటాడు. బాలయ్య పాత్రకి ఎలివేషన్‌ ఇచ్చాడు. ఈ క్రమంలో ఓ రైల్వే స్టేషన్‌ వద్ద అదే మంచు పొగలో నుంచి బాలకృష్ణ నడుచుకుంటూ వస్తున్నాడు. ఒక చేతిలో బ్యాగు, మరో చేతిలో పెట్టే ఉంది. చాలా సింపుల్‌గా ఎంట్రీ ఇచ్చాడు బాలయ్య. 

అనంతరం ఓ అడవిలో మంటలు చెలరేగుతుండగా, బాలయ్య అరుస్తూ గుర్రంపై స్వారీ చేయడం అదిరిపోయేలా ఉంది. గతంలో మాదిరిగా అరుస్తూ బారేడు డైలాగులు లేవు. సింపుల్‌గా పరిచయం, హై ఓల్టేజ్‌తో ముగించారు. సినిమాల్లో ఏదో దాస్తున్నారనే విషయం అర్థమవుతుంది. సినిమాపై ఆసక్తిని పెంచుతున్నారు. మరి ఇది ఏ ంరేజ్‌లో మెప్పిస్తుందో చూడాలి. బాలయ్య బర్త్ డే సందర్భంగా ఈ మూవీ టైటిల్‌ని రివీల్‌ చేస్తారని అన్నారు. కానీ కేవలం గ్లింప్స్ తోనే సరిపెట్టారు. గ్లింప్స్ కూడా డీసెంట్‌గా ఉంది. 

YouTube video player

బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీకి `వీరమాస్‌` అనే టైటిల్‌ని అనుకుంటున్నారట. ఈ రోజు రివీల్‌ చేస్తారనే ప్రచారం జరిగింది కానీ డిజప్పాయింట్‌ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూ ఫోర్‌ సినిమాస్‌, శ్రీకర స్టూడియోస్‌ పతాకాలపై ఈ మూవీ రూపొందుతుంది. ఈ మూవీని దసరాకి ఆడియెన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.