Asianet News TeluguAsianet News Telugu

దసరాకు థియేటర్స్ లో ...సంక్రాంతికి అక్కడ రచ్చకు రెడీ

అఖండ‌, వీర‌సింహారెడ్డి త‌ర్వాత బాల‌కృష్ణ కెరీర్‌లో వంద కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన మూవీగా భ‌గ‌వంత్ కేస‌రి నిలిచింది. 

Balakrishna Bhagavanth Kesari OTT Release Date confirmed? jsp
Author
First Published Nov 1, 2023, 8:09 AM IST

సినిమాకు హిట్ టాక్ వస్తే అదెప్పుడు ఓటిటిలో రిలీజ్ అవుతుందా అని ఎదురూచూసే వర్గం ఉంటుంది. వాళ్లు ధియేటర్ కు రకరకాల కారణాలతో వెళ్లకుండా ఓటిటిలలో చూస్తూంటారు. అలాగే హీరో అభిమానులు రిపీట్ గా తమ హీరో చిత్రాన్ని చూడటానికి ఓటిటిని ఎంచుకుంమటున్నారు. ఈ క్రమంలో ఓటిటి రిలీజ్ డేట్ అని కీలకమైపోయింది. ఈ క్రమంలో బాలయ్య తాజా చిత్రం భగవంత్ కేసరి ఓటిటి రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నారు. 

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది. అక్టోబర్ 19న రిలీజ్ అయిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ గురించి తాజాగా ఓ సమాచారం బయటికి వచ్చింది.

 మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ...భగవంత్ కేసరి సినిమా నవంబర్ 23వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రాబోతోంది. ఈ మేరకు వార్తలు  సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ విషయంపై అఫీషియల్ ఎనౌన్సమెంట్ రావాల్సి ఉంది. అలాగే ఓటిటిలలో వచ్చిన నెల రోజుల గ్యాప్ లో టీవిలో ప్రసారం చేసేలా ఎగ్రిమెంట్ అని తెలుస్తోంది. అంటే సంక్రాంతికి ఈ చిత్రం టీవీల్లో రానుంది. 

 మరో ప్రక్క ఈ చిత్రంకి ఫేమస్ యాప్ అయిన బుక్ మై షో లో 1.23 మిలియన్స్ కి పైగా టికెట్స్ బుక్ అయ్యాయి. ఇదే విషయాన్ని మేకర్స్ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాకు అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. రివేంజ్ డ్రామాకు మెసేజ్‌ను జోడిస్తూ అనిల్ రావిపూడి ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఇందులో నేల‌కొండ భ‌గ‌వంత్ కేస‌రి పాత్ర‌లో బాల‌కృష్ణ యాక్టింగ్‌, డైలాగ్స్‌తో పాటు అత‌డిపై తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. భ‌గ‌వంత్ కేస‌రి సినిమాలో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టించింది. షైన్ స్క్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. అర్జున్ రామ్‍పాల్ విలన్ పాత్రలో మెప్పించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ ఈ చిత్రాన్ని నిర్మించింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios