మరోసారి తాతయ్య కాబోతున్న బాలయ్య

Balakrishna becomes grand father again
Highlights

  • నందమూరి బాలకృష్ణ మీసాలు లాగే పెద్ద మనవడు దేవాన్ష్ కు మరొక తోడు లాండయ్యాడు
  • బాలయ్య చిన్న కూతురు తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది​
  • పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత వీళ్ళకు మొదటి సంతానం కలగడం అందులోనూ మగ బిడ్డ కావడం రెండు కుటుంబాలు ఆనందంతో మురిసిపోతున్నాయి​

నందమూరి బాలకృష్ణ మీసాలు లాగే పెద్ద మనవడు దేవాన్ష్ కు మరొక తోడు లాండయ్యాడు. బాలయ్య చిన్న కూతురు తేజస్విని పండంటి బాబుకి జన్మనిచ్చింది. భర్త శ్రీభరత్ తో తన వివాహం 2013లో జరిగిన సంగతి తెలిసిందే. పెళ్ళైన ఐదేళ్ళ తర్వాత వీళ్ళకు మొదటి సంతానం కలగడం అందులోనూ మగ బిడ్డ కావడం రెండు కుటుంబాలు ఆనందంతో మురిసిపోతున్నాయి. శ్రీభరత్ గీతం యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఎంఎస్పి రామారావు మనవడన్న విషయం విదితమే. ఇప్పుడు ఈ వార్తతో వాళ్ళ సంతోషం పీక్స్ లోకి చేరుకుంది. వ్యాపారవేత్తగా కొనసాగుతున్న శ్రీభరత్-తేజస్విని జంట చాలా అరుదుగా బయట కనిపిస్తూ ఉంటారు. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మణి హెరిటేజ్ వ్యాపార వ్యవహారాలతో పాటు మంత్రి లోకేష్ భార్యగా పబ్లిక్ లైఫ్ లో కనిపించడం సహజమే కాని తేజస్విని మాత్రం అలా రావడం తక్కువే.

మొత్తానికి బాలయ్య రెండో సారి తాతయ్య కావడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ సంతానం కాబట్టి నందమూరి వారసుడు అనలేకపోయినా బాలకృష్ణ మనవడు కాబట్టి ఆ ట్యాగ్ చాలు అంటున్నారు. బాలయ్యకు ఈ ఏడాది బాగున్నట్టు ఉంది. జైసింహ ఈ సంవత్సరం ప్రారంభంలో డీసెంట్ హిట్ గా నిలవగా నాన్న బయోపిక్ ఎన్టీఆర్ నిర్మాణం కోసం ఏర్పాట్లు చకచకజరుగుతున్నాయి. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ నేతృత్వంలో ఆనాటి వాతావరణాన్ని రీ క్రియేట్ చేయటం ఈపాటికే మొదలైంది. రంగస్థలంకు వర్క్ చేసింది వీళ్ళే. భుజానికి చేయించుకున్న చికిత్స విజయవంతం అయ్యి పూర్తిగా కోలుకోవడంతో బాలయ్య మంచి హుషారుగా ఉన్నారు.

ఇద్దరు బిడ్డల మురిపాలు తీర్చుకుంటున్నారు బాగానే ఉంది. మరి బాలయ్య నట వారసుడు మోక్షజ్ఞను ఎప్పుడు పరిచయం చేస్తారన్న ప్రశ్నకు ఇంకా సూటి సమాధానం రావడం లేదు. ఈ ఏడాది లోనే ఉంటుంది అన్న బాలకృష్ణ ఎవరితో ఏ జానర్ లో ఉంటుంది అనే వివరాలు బయట పెట్టడం లేదు. ఎన్టీఆర్ బయోపిక్ విడుదల వచ్చే సంక్రాంతికి ప్లాన్ చేస్తున్నారు.  

loader