బోయపాటి మూవీ అంటే బాలయ్యను ఆపడం కష్టమే. ఆ విషయాన్ని మరలా నిరూపించాడు ఆయన. ఉగాది కానుకగా విడుదలైన బాలయ్య అఘోరా లుక్ టీజర్, టైటిల్ అదిరిపోయాయి. హిట్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీకి అఖండ అనే పవర్ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక అఘోరాగా బాలయ్య లుక్ అద్భుతం అని చెప్పాలి. బాలయ్య లుక్, ఆహార్యం గూస్ బంప్స్ కలిగించేవిగా ఉన్నాయి.

 
టీజర్ లో బాలయ్య చెప్పిన ''కాలుదువ్వే నంది ముందు రంగుమార్చిన పంది... కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది'' అనే డైలాగ్ మాములుగా లేదు. ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ బాలయ్య చెప్పిన ఆ డైలాగ్ మెప్పించింది. బోయాపాటి అఖండ మూవీలో తన మార్కు యాక్షన్, డైలాగ్స్ పవర్ చూపిస్తాడని అర్థం అవుతుంది. 


అఖండ మూవీ నుండి వచ్చిన రెండు టీజర్స్ ఫ్యాన్స్ ని మెప్పించేవిగా ఉన్నాయి. దీనితో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సమ్మర్ కానుకగా అఖండ మూవీ విడుదల కానుంది. ద్వారక క్రియేషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా, ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు .