మల్టీ స్టారర్ మూవీ చేయడానికి రెడీగా ఉన్నానన్నారు నటసింహం బాలకృష్ణ. అఖండ మూవీ అఖండ విజయం తరువాత జైత్రయాత్ర చేస్తున్న బాలయ్య, మల్టీ స్టారర్ మూవీపై ఇంట్రెస్టింగ్ విషయం చెప్పారు.  


అఖండ సినిమా సూపర్ సక్సెస్ జోష్ లో ఉన్నారు నందమూరి బాలకృష్ణ, విజయోత్సవ యాత్రలు కూడా చేస్తున్నారు. వరుసగా దైవదర్శనాలు చేసుకుంటున్న మూవీ టీమ్.. రీసెంట్ గా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. దర్శకుడు బోయాపాటితో కలిసి బాలయ్య సినిమా విశేషాలు కూడా పంచుకున్నారు.

తన సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు బాలయ్య. డైరెక్టర్లు ముందుకు వస్తే.. మల్టీ స్టారర్ మూవీ చేయడానికి కూడా రెడీగా ఉన్నానన్నారు. ఇంతకు ముందు కూడా మంచువారి ఫ్యామిలీతో కలిసి "ఊ..కొడతారా ఉలిక్కి పడతారా"సినిమా చేశారు బాలయ్య. అయితే ఈసారి మాత్రం పక్కా కమర్షియల్.. యాక్షన్ మల్టీ స్టారర్ మూవీ చేసే ఆలోచనలో బాలయ్య బాబు ఉన్నట్టు తెలుస్తోంది.

రీసంట్ గా బాలయ్య మల్టీ స్టారర్ మూవీ చేస్తారంటూ చాలా రూమర్స్ వినిపించాయి. నటసింహంతో స్క్రీన్ శేర్ చేసుకునే స్టార్ ఎవరూ..? అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి నడిచింది. ఎవరికి వారు ఫలానా స్టార్ హీరోతో బాలయ్య సినిమా అంటూ ప్రచారం చేసుకున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ తో బాలయ్య మల్టీ స్టారర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చే్స్తున్నారు. ఎన్టీఆర్ తో ఈసారి సినిమా పక్కాగా ఉటుందనే ఆశలో ఉన్నారు ఫ్యాన్స్. 

అటు అనిల్ రావిపూడితో బాలయ్య సినిమా మల్టీస్టారర్ గానే తెరకెక్కే అవకాశం లేకపోలేదు. గతంలోనే ఈ సినిమాపై చాలా మాటలు వినిపించాయి. అనిల్ బాలయ్య-ఎన్టీఆర్ కాంబో మూవీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా టాక్ నడిచింది. మరో వైపు బాబాయి అబ్బాయి కాంబినేషన్ తో పాటు బాలయ్య- మహేష్ బాబు, బాలయ్య- వెంకటేష్, ఇలా చాలా కాంబినేషన్స్ ను సోషల్ మీడియాలో తెరపైకి తీసుకొచ్చారు. మరి మల్టీ స్టారర్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య.. ఫ్యూచర్ లో ఏ స్టార్ తో సినిమా అనౌన్స్ చేస్తారో వేచి చూడాల్సిందే. 

SUNIL-PUSHPA : ఇండస్ట్రీకి వచ్చిందే విలన్ అవ్వాలని : సునిల్

ఇక ఈ మధ్య బాలకృష్ణ స్పీడు పెంచారు. సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. అటు బుల్లితెరపై కూడా షోలు చేస్తూ హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతానికి అఖండ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న బాలయ్య.. ఆమధ్య తన అన్ స్టాపబుల్ షోలో కూడా ఓ అనౌన్స్ మెంట్ చేశారు. తాను విలన్ గా కూడా నటించడానికి రెడీగా ఉన్నానంటూ చెప్పేశారు. కాని హీరోకూడా తానేనంటు చమత్కరించారు బాలయ్య. ఏది ఏమైనా బాలయ్య ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషీగా ఉన్నారు.