బాలకృష్ణ, చిరంజీవి ఈ సీనియర్ హీరోలిద్దరూ తమ స్టేచర్ కు తగినట్లుగా పీరియడ్ ఫిల్మ్స్ తో తమ అభిమానులను అలరించటానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. బాలయ్య తన తండ్రి నందమూరి తారకరామారావు జీవిత చరిత్రను ఎన్టీఆర్ కథానాయుడుకు టైటిల్ తో తెరకెక్కిస్తూంటే చిరంజీవి..స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'సైరా నరసింహారెడ్డి'లో మెగాస్టార్ చిరంజీవి టైటిల్ రోల్ పోషిస్తున్నారు.   అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ కనిపించబోయే ఏకైక గెటప్ ‘అల్లూరి సీతారామరాజు’ అని తెలుస్తోంది.

అప్పట్లో నందమూరి తారకరామారావు కు అల్లూరి సీతారామరాజు పాత్ర అంటే మక్కువ ఎక్కువ ఉండేది. ఆయన ఓ సినిమా కూడా చేద్దామనుకుని స్క్రిప్టు రెడీ చేసుకుని కృష్ణ సినిమా చేసేయటంతో ఆగిపోయారు. అయితే ఆ మక్కువ అలాగే ఉండిపోయి తర్వాత ఎప్పుడో వయస్సు మళ్లిన తర్వాత చేసిన మేజర్ చంద్రకాంత్ సినిమాలో.. పుణ్యభూమి నాదేశం పాటలో ఆ గెటప్ లో కనిపించారు. ఆ విషయాలను గుర్తు చేయటానికి క్రిష్ నడుంకట్టి..ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ లో బాలయ్య చేత ‘అల్లూరి సీతారామరాజు’ వేషం వేయిస్తున్నారని సమాచారం.

ఇక చిరు విషయానికి వస్తే..

ప్రముఖ యాక్షన్ చిత్రాల దర్శకుడు సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా జార్జియాలో జరుపుకున్న లాంగ్ షెడ్యూల్ లో కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలను మరియు భారీ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర యూనిట్.

ఈ నేపధ్యంలో  ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ చేస్తోన్న సన్నివేశాలు చాలా ఎమోషనల్ గానూ.. సినిమాకే హైలెట్ గానూ నిలుస్తాయని టాక్.  అందుతున్న సమాచారం ప్రకారం ‘సైరా’లో చిరంజీవి అల్లూరి సీతారామరాజు గెటప్ లో కూడా కనిపించనున్నారని తెలుస్తోంది.

ఎక్కడ వస్తుందీ గెటప్ ..

కథ ప్రకారం ..నరసింహరెడ్డిని బ్రిటిష్ సైన్యం ఊరి తీసిన తరువాత… ఆ తర్వాత కాలంలో నరసింహ రెడ్డి స్ఫూర్తితో మళ్లీ బ్రిటిష్ సైన్యం పై తిరుగుబాటు చేసిన కొంతమంది విప్లవకారులు తయారు అయ్యారు. వారిని  ఈ సినిమాలో చూపించనున్నారు.

అయితే చెప్పుకోదగ్గ విషయం ఏమంటే...ఆ విప్లవకారుల గెటప్స్ లోనూ మెగాస్టారే కనిపిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా అల్లూరి సీతారామరాజు గెటప్ వేయనున్నారు. దాంతో సీతారామరాజు గెటప్  లో కూడా చిరంజీవినే కనిపించనున్నారు. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుంది.  హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రం వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.