నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటోంది. అఖండ చిత్రం సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య అదే జోరుని వీరసింహాసరెడ్డితో కూడా ప్రదర్శించారు.

నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ఫ్యాన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉంటోంది. అఖండ చిత్రం సూపర్ సక్సెస్ తర్వాత బాలయ్య అదే జోరుని వీరసింహాసరెడ్డితో కూడా ప్రదర్శించారు. ఇటీవల తన ఫ్యామిలిలో జరిగిన విషాదకర సంఘటన పక్కన పెడితే.. బాలయ్య పట్టిందల్లా బంగారమే అవుతోంది. సినిమాలు సూపర్ హిట్స్ అవుతున్నాయి. అన్ స్టాపబుల్ అంటూ టాక్ షో చేస్తే.. అది తిరుగులేని షో గా మారిపోయింది. 

ఎప్పుడూ లేని విధంగా బాలకృష్ణ ప్రస్తుతం కమర్షియల్ యాడ్స్ కూడా చేస్తున్నారు. తాజాగా బాలయ్య విజయవాడలో ఓ జ్యువెలరీ షోరూం ని ప్రారంభించారు. అఖండ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ కూడా ఈ ఓపెనింగ్ లో పాల్గొంది. వీరిద్దరూ జ్యువెలరీ సంస్థకి బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. బాలకృష్ణ ఏం చేసినా అది పాలిటిక్స్ తో ఎంతోకొంత ముడిపడి ఉంటుంది. ఎందుకంటే బాలయ్య ఎమ్మెల్యే కూడా. బాలయ్య ప్రతి కదలిక సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. 

నటుడిగా బాలయ్య ఎంతో సీనియర్, అలాగే రాజకీయ నాయకుడు కూడా.. కానీ బాలయ్య ఒక కమర్షియల్ హీరో తరహాలో ప్రకటనలు, వాణిజ్యపరమైన ప్రారంభోత్సవాలు చేయడం ఏంటి అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విమర్శలు బాలయ్య వరకు వెళ్ళాయేమో.. జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ లో బాలయ్య దీని గురించి మాట్లాడారు. 

మీడియాతో మాట్లాడుతూ.. బాలకృష్ణ ఏంటి జ్యువెలరీ షోరూం ఓపెనింగ్ కి రావడం ఏంటి అని చాలా మంది అనుకోవచ్చు. లోకులు కాకులు. కాబట్టి నేను ఎవరినీ పట్టించుకోను. మనం తెలుగు వాళ్ళం. ఎవరు ఏం సాధించినా ప్రోత్సహించడానికి నేను ముందుంటాను. అందుకే ఓపెనింగ్ కి విజయవాడ వచ్చాను అని బాలకృష్ణ అన్నారు. 

నేను ఈ షోరూం ఓపెనింగ్ కి విజయవాడ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇది నందమూరి స్ట్రీట్.. పైగా బృందావన్ గార్డెన్స్.. బృందావనం ఎక్కడ ఉంటే అక్కడ బాలకృష్ణుడు ఉంటాడు అంటూ చమత్కరించారు. నేను ఏం చేసినా అభిమానులు ఆదరిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ నాతో అఖండ చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. ఇటీవల వచ్చిన వీర సింహా రెడ్డి చిత్రాన్ని కూడా హిట్ చేశారు . అలాగే అన్ స్టాపబుల్ షో దేశంలోనే నంబర్ వన్ షో అంటూ బాలయ్య మీడియాతో పంచుకున్నారు.