నందమూరి బాలకృష్ణ ఒకసారి కమిట్ అయితే సినిమా పట్టాలెక్కాల్సిందే అనే టాక్ ఫిల్మ్ నగర్ లో గట్టిగా వినిపిస్తుంటుంది. అయితే పరిస్థితులు అనుకూలంగా లేకపోతే చాలావరకు ఊహించని పరిణామాలు ఎదురవుతాయి. బోయపాటి విషయంలో ఇప్పుడు బాలకృష్ణ అదే ఆలోచనలో పడ్డట్లు టాక్. ఈ మాస్ డైరెక్టర్ గత రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ ని అందుకున్నాయో తెలిసిందే. 

మెయిన్ గా వినయ విధేయ రామ అయితే బోయపాటికి గట్టి దెబ్బె కొట్టింది. ఇన్నేళ్లు సంపాదించుకున్న కీర్తి ఒక్కసారిగా మట్టిలో కలిసినంత పనయ్యింది, అయితే నెక్స్ట్ బోయపాటి బాలకృష్ణతో ఒక కథను ఒకే చేయించుకున్న సంగతి తెలిసిందే. అసలే ఎన్టీఆర్  కథానాయకుడితో దెబ్బతిన్న బాలయ్య మహానాయకుడు ఎలాంటి రిజల్ట్ ని ఇస్తుందో అని ఆందోళన ఉన్న సమయంలో నెక్స్ట్ బోయపాటి సబ్జెక్టుపై కూడా కొంత ఆలోచనలో పడ్డట్లు టాక్. 

అది కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమా కావడంతో కొంచెం ఓవర్ అయినా కూడా ఎఫెక్ట్ తప్పదు. దీంతో స్క్రిప్ట్ లో చేంజెస్ అవసరమని బాలకృష్ణ సలహాలు ఇచ్చినట్లు సమాచారం. మాట ఇచ్చాడు గనక ఈ సినిమా చేయక తప్పదు. అందులోను కెరీర్ డౌన్ అవుతున్న సమయంలో సింహా - లెజెండ్ వంటి హిట్స్ ఇచ్చాడు. దీంతో అచ్చోచ్చిన దర్శకుడు కాబట్టి బాలయ్య సుముఖంగానే ఉన్నా కూడా ఎదో డౌట్ కొట్టిందట. అందుకే సినిమా కథలో మార్పులు అవసరమని దర్శకుడికి చెప్పినట్లు టాక్.