వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు నట సింహం బాలకృష్ణ. అఖండ సక్సెస్ జోష్ ను ఇప్పటికీ ఆస్వాదిస్తున్న స్టార్ సీనియర్ హీరో.. నెక్ట్స్ చేస్తోన్న సినిమా రిలీజ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
అఖండ సక్సెస్ జోష్ తో వరుస సినిమాలు లైన్ అప్ చేసుకుంటున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఫుల్ జోష్ చూపిస్తున్నాడు స్టార్ సీనియర్ హీరో. అదే జోష్‌ను తన నెక్ట్స్ సినిమాలో కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య బాబు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ పొలిటికల్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ చేసుకుంటుంది ఈమూవీ. ఈ సినిమాపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.
రెండు గెటప్‌లలో బాలకృష్ణ ఈమూవీలో అలరించబోతున్నట్టు తెలుస్తోంది. క్రాక్ సినిమాతో మంచి హిట్ అందుకున్న మలినేని గోపీచంద్ అదే జోష్ తో బాలయ్య సినిమా చేస్తు్న్నాడు. చాలా కాలం తరువాత ఫుల్ లెన్త్ రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ తో ఈసినిమా తెరకెక్కుతోందని సమాచారం. ఇప్పటికే విడుదలైన బాలయ్య పోస్టర్‌లు ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమాను దసరా కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు గతంలో మేకన్స్ బావించారు.
ఈ సినిమా రిలిజ్ డేట్ తో పాటు ఈసినిమా టైటిల్ కూడా ఫ్యాన్స్ తో .. ఆడియన్స్ లో క్యూరియాసిటీని రేకెత్తిస్తోంది. సినిమాకు ఏం టైటిల్ పెడతారు.. ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు అన్న ఇన్ ఫర్మేషన్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. దసరా టైమ్ కు సీనియర్ హీరోలంతా పోటీ పడబోతున్నట్టు టాక్ గట్టిగా నడిచింది. ఈ సారి బాక్సా ఫీస్ వార్ గట్టిగా ఉండబోతుంది అని అనకున్నారంతా.. కాని పరిస్థితుల్లో మార్పు కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
దసరా రేసు నుండి బాలకృష్ణ తప్పకుంటున్నట్లు తెలుస్తుంది. దీనికి కారణం బాలకృష్ణకు రెండు సార్లు కొవిడ్ రావడం. అంతేకాకుండా పలువురు టెక్నీషియన్‌లకు కూడా కొవిడ్ రావడంతో షూటింగ్ మరింత ఆలస్యమవుతూ వస్తుందట. ఇప్పటికే పరుగులు పెట్టి షూటింగ్ చేస్తున్నా.. ఏదో ఒక బ్రేక్ వచ్చి సినిమా షూటింగ్ ముందుక కదలడం లేదని తెలుస్తోంది. . ఇంకా పూర్తి చేయాల్సి షూటింగ్ పార్ట్ చాలానే ఉందట.దాంతో ఈ సినిమా రిలీజ్ టైమ్ మార్చుకుంటే మంచిది అని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే అఖండ మాదిరిగానే ఈ సినిమాను కూడా డిసెంబర్‌లో విడుదల చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య పవర్ ఫుల్ రోల్ చేస్తున్న ఈసినిమాకు మొదట వేటపాలెం అనే టైటిల్ ను పరిశీలించారు.. ఇక ఇప్పుడు మాత్రం ఈ సినిమాకు అన్నగారు అనే టైటిల్‌అనకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా శృతిహాసన్ హీరోయిన్‌గా నటిస్తుంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ గా తెలుగు తెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. రీసెంట్ గా ఆయన షూటింగ్ లో జాయిన్ అయ్యారు.
అఖండ సినిమాకు అద్భతమైన సంగీతంతో పాటు బీజియం కూడా అందించి ఎస్ఎస్. థమన్.. ఈ సినిమాకు కూడా సంగీతాన్ని అందిస్తున్నాడు. సాయిమాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నాడు. ఇక ఇప్పటికే దసరా రేసులో చిరంజీవి గాడ్‌ఫాదర్, నాగార్జున ది ఘోస్ట్ సినిమాలు ఉండగా.. బాలయ్య కూడా చేరితే సీన్ రసవత్తరంగా మారుతుంది అని ఊహించిన సినిమా పండితులకు, ఆడియన్స్ కు నిరాశే ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఎటువంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలో చేసే అవకాశం ఉంది.
