చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది బలగం సినిమా. కమెడియన్ వేణు డైరెక్టర్ గా మారి రూపొందించిన ఈసినిమా.. సూపర్ సక్సెస్ అవ్వడంతో పాటు.. ఇండస్ట్రీలో పెద్ద చర్చకుదారి తీసింది. ఇక ఈసినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది.
కొన్ని సినిమాలకు కథే హీరో.. కథే బలం.. కథే బలగం. స్టార్ హీరోలు.. హీరోయిన్లు అవసరం లేదు. స్టార్ డైరెక్టర్ తీయ్యనవసరం లేదు...బారీ బడ్జెట్ పెట్టనక్కనక్కర్లేదు. కథాబలంతో.. ప్రేక్షకులను కట్టిపడేస్తాయి సినిమాలు. అలాంటి సినిమానే బలగం. చిన్న సినిమాగా వచ్చి ప్రజల మనసులు దోచింది మూవీ. అంతే కాదు ఎందరో అన్నా చెల్లెల్లు.. అన్నాతమ్ములను కలిపింది ఈసినిమా. మెగాస్టార్ నుంచి ఇండస్ట్రీ పెద్దలంతా.. అద్భుతం అని మెచ్చుకున్న ఈ సినిమా థియేటర్లలో 50రోజులు పూర్తి చేసుకుంది.
థియేటర్లకు రావడానికి జనాలు పెద్దగా ఆసక్తి చూపని తరుణంలో బలగం అనే చిన్న సినిమా అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. మంచి ఎమోషన్స్ తో కూడిన ఈ సినిమాకు.. జబర్థస్త్ కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. ప్రియదర్శి మరియు కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. కమర్షియల్‌గా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ఈ చిత్రం ఇప్పుడు థియేటర్లలో 50 రోజుల రన్‌ను పూర్తి చేయడం ద్వారా అరుదైన ఫీట్‌ను సాధించింది.
ఈ మధ్య కాలంలో పెద్ద సినిమాలకు కూడా ఇది సాధ్యం కాని విషయం. ఇది ఖచ్చితంగా బలగం సాధించిన అద్భుతమైన విజయం. OTTలో వచ్చిన తర్వాత కూడా ఈసినిమా థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టింది. బలగం సినిమాను హర్షిత్ రెడ్డి, హన్షితారెడ్డి నిర్మించగా... ధమాకా ఫేమ్ భీమ్స్ సిసిరోలియో సౌండ్‌ట్రాక్‌లను సమకూర్చారు. వేణు యెల్దండి, మురళీధర్ గౌడ్, జయరామ్, రూప, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు.ఇక ఈమూవీ ఎన్నో అవార్డ్ లను సైతం సాధించింది.
ఈసినిమా చూసి మెగాస్టార్ చిరంజీవి టీమ్ ను బోళా శంకర్ షూటింగ్ సెట్స్ కు పిలిచి మరీ సన్మానించారు. మూవీ చూడగానే అద్భుతం అని మెచ్చుకున్న మెహాన్ బాబు, మంచు విష్ణు.. వెంటనే వేణు అండ్ టీమ్ ను ఇంటికి పిలిచి మరీ సన్మానించారు. ఇలా ఎంతో మంది ప్రశంసలు అందుకున్న ఈసినిమాను దిల్ రాజు నిర్మించగా.. వేణు దైరెక్షన్ లో దిల్ రాజు మరో సినిమా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
