బలగం మూవీ అవకాశం తృటిలో చేజారేదని నటుడు మురళీధర్ గౌడ్ వెల్లడించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దిల్ రాజు తనను వద్దన్నారని ఆయన చెప్పుకొచ్చారు.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది బలగం. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు ప్రేక్షకులు మదిలో గుర్తుండిపోతాయి. పెద్దగా పేరున్న నటుల కాకపోయినా చాలా సహజంగా నటించి మెప్పించారు. సాయిలు, కొమురయ్య, ఐలయ్య, నారాయణ, లక్ష్మితో పాటు మరికొన్ని పాత్రలు ప్రేక్షకులను వెంటాడుతాయి. బలగం మూవీలో నారాయణ అనే పాత్రను డీజే టిల్లు ఫేమ్ మురళీధర్ గౌడ్ చేశారు. బామ్మర్దులు అవమానించారని అత్తింటికి దూరమైన అల్లుడిగా ఆయన కనిపించారు. బలగం మూవీలో గుర్తిండిపోయే పాత్రల్లో నారాయణ కూడా ఒకటి. 

అయితే ఈ పాత్ర చేసే అవకాశం తృటిలో చేజారేదని మురళీధర్ గౌడ్ వెల్లడించారు. లేటెస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... దిల్ రాజు తనను వద్దన్నారని ఆయన చెప్పుకొచ్చారు. బలగం మూవీలో పాత్రలు చేసే నటుల ఫొటోలన్నీ డైరెక్టర్ వేణు నిర్మాత దిల్ రాజు టేబుల్ మీద పెట్టారు. అన్ని ఫోటోలు చూసిన దిల్ రాజు నన్ను వద్దన్నారు. వేరే నటుడిని తీసుకుందాం అన్నారు. అయితే వేణు ఆయన్ని ఒప్పించారు. దాంతో నాకు నారాయణ పాత్ర దక్కింది. లేదంటే ఒక మంచి సినిమాను కోల్పోయేవాడినని మురళీధర్ గౌడ్ చెప్పారు.

ప్రస్తుతం ఎక్కడ చూసినా బలగం మూవీ గురించే చర్చ నడుస్తుంది. సినిమా గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. దర్శకుడు వేణు ఎల్దండి పేరు మారుమ్రోగుతుంది. ఈ పల్లెటూరి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా బాక్సాఫీస్ వద్ద వండర్స్ క్రియేట్ చేసింది. దాదాపు రూ. 22 కోట్ల గ్రాస్ రూ. 10 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. ప్రస్తుతం బలగం అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. ఓటీటీలో కూడా అద్భుతమైన రెస్పాన్స్ దక్కుతుంది. 

 బలగం మూవీలో స్టార్ క్యాస్ట్ లేరు. అయినా ఆడియన్స్ థియేటర్స్ కి పోటెత్తారు. కాగా బలగం మూవీ కథ నాదే అంటూ జర్నలిస్ట్ సతీష్ గడ్డం మీడియా ముందు ఆరోపణలు చేశారు. గతంలో నేను రాసిన పుచ్ఛిక అనే కథకు మార్పులు చేసి బలగం మూవీ తీశారంటూ ఆయన ఆరోపించారు. గడ్డం సతీష్ ఆరోపణలు ఖండించిన వేణు... ఆయన కథ నేను చదివింది లేదు. ఆరేళ్ళు నేను రీసెర్చ్ చేసి రాసుకున్న కథ అని చెప్పుకొచ్చారు.