ప్రముఖ తమిళ దర్శకుడు బాలా దర్శకత్వంలో సినిమా చెయ్యాలని చాలా మంది ఉత్సాహం చూపుతారు. అయితే ఆయన తన పాత్రకు తగిన వారినే ఎంచుకుని ట్రైనింగ్ ఇచ్చి మరీ సినిమాలు చేస్తూంటారు.అదే పద్దతిలో తెలుగు అమ్మాయి బిందు మాధవి కు ఆయన సినిమాలో ఆఫర్ వచ్చినట్లు కోలీవుడ్ సినీ వర్గాల సమచారం. ఆవకాయ బిర్యాని చిత్రంతో పరిచయం అయిన ఆమె ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, పిల్ల జమీందార్, బంపర్ ఆఫర్ వంటి సినిమాలు చేసినా బిజీ కాలేకపోయింది. అయితే ఇప్పుడు బాలా దర్శకత్వంలో ఆపర్ రాగానే మురిసిపోతోంది. 

రీసెంట్ గా  బాలా దర్శకత్వంలో ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ పూర్తయినా కొన్ని కారణాల వల్ల రిలీజ్ ఆపు చేసి, మరో దర్శకుడుతో సినిమా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో తదుపరి సినిమాపై ఆయన దృష్టి పెట్టారు. ఇందులో అధర్వ, ఆర్యలు హీరోలుగా నటిస్తున్నట్లు సమాచారం. 

రీసెంట్ గా  ఆర్యకు కూడా ఈ సినిమా కథను బాలా వినిపించారని, వెంటనే ఆయన నటించేందుకు ఒప్పుకొన్నట్లు సమాచారం. గతంలో అధర్వతో ‘పరదేశి’ చిత్రాన్ని బాలా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో కూడా మరో భిన్నమైన గెటప్‌లో అధర్వ కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. జీవీ ప్రకాశ్‌ సంగీతం సమకూర్చనున్నారు. త్వరలోనే పూర్తి వివరాలను వెల్లడించనున్నారు.