Asianet News TeluguAsianet News Telugu

మంగోలియా టీవీలో 'బాహుబలి'

 ప్రభాస్ ను పాన్ ఇండియా హీరోగా మార్చిన ఈ చిత్రాన్ని తాజాగా మంగోలియా భాషలోకి అనువదించారు. భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆగస్టు 16న మంగోలియాలోని ‘టీవీ-5’ చానెల్లో బాహుబలి చిత్రం ప్రదర్శించబోతున్నారు.

Bahubali to be telecast on Mangolia TV
Author
Hyderabad, First Published Aug 16, 2020, 11:55 AM IST


 దర్శకధీరుడు ఎస్. ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో.. ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం అద్భత విజయం సాధించి.. కొన్ని వేల కోట్ల వసూళ్లు రాబట్టింది. అయితే ఈ సినిమా విడుదలై ఇప్పటికే రెండు సంవత్సరాలు అవుతున్నా.. క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 

అయితే అందరూ దాదాపు తమ భాషల్లోకి డబ్ చేసుకుని ఈ సినిమాని చూసి ఆనందించారు. ఈ సినిమా రాజమౌళి దర్శక ప్రతిభకు, నిర్మాణపు విలువలకు నిదర్శనంగా లిచింది. ఆ సినిమాతో హీరో ప్రభాస్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అతని మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పెరిగిపోయింది.

అంతటి సంచలనాలకు మారుపేరైన ఈ చిత్రం ఇప్పటికే ప్రపంచంలోని అనేక భాషల్లోకి అనువాదమై ఆయా దేశాల్లో ప్రదర్శితమైంది. తాజాగా ఈ చిత్రాన్ని మంగోలియా భాషలోకి కూడా అనువదించారు. మన స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగోలియాలోని భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో జరిగే ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ లో భాగంగా ఈ చిత్రాన్ని అక్కడి TV-5లో ఈ రోజు (ఆగస్టు 16) ప్రదర్శిస్తున్నారు. ఆ దేశస్థులు తమ మాతృభాషలో ఆ విధంగా మన బాహుబలిని ఆస్వాదించనున్నారు. బాహుబలి జైత్రయాత్రలో ఇది కూడా భాగం కానుంది.  

దీంతోపాటు, ఆగస్టు 15న కంగనా రనౌత్ లీడ్ రోల్ పోషించిన బాలీవుడ్ హిట్ మూవీ ‘క్వీన్’ మంగోలియా భాషలో ప్రసారం చేయనున్నారు. ఆగస్టు 17న మరో బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ నటించిన ‘నీర్జా’ బయోపిక్ మంగోలియా భాషలో ప్రదర్శించనున్నారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios