బాహుబలి టికెట్ ధరలు చూస్తే గుండె ఆగినంత పనవుతోంది.. దేశ రాజధాని దిల్లీలో పీవీఆర్ సినిమాస్  లో టికెట్ ధర 2400రూపాయలు రిలీజ్ రోజునుంచి భారీగా జరగనున్న బ్లాక్ మార్కెట్ టికెట్ల దందా టికెట్స్ రేట్లకు హడలెత్తి ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించే ప్రమాదం

గత కొంత కాలంగా కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో తెలుసుకుందామనే ఆసక్తి దేశమంతా కనబరుస్తోంది. రిలీజ్ డేట్ మరో రెండ్రోడులే ఉండటంతో బాహుబలి ఫీవర్ తో జనం మండుటెండలో హాట్ హాట్ గా మారిపోతున్నారు. బాహుబలి గురించి ఎక్కడ చూసినా. టికెట్ల గురించే చర్చ అంతా.

ఇంతకీ బాహుబలి 2 టికెట్ల రేటు అత్యధికంగా ఎంతో తెలుసా. ఒక్కో టికెట్ ధర వేలకు వేలు పలుకుతోంది. అది కూడా ఇక్కడా అక్కడా కాదు మన దేశ రాజధాని ఢిల్లీలో. అవును మీరు చదువుతున్నది నిజం. దిల్లీలోని ఓ థియేటర్ యాజమాన్యం బాహుబలి 2 టికెట్లను రికార్డు స్థాయిలో అత్యధిక రేటుకు అమ్ముతున్న థియేటర్ గా రికార్డులకెక్కింది.

దేశవ్యాప్తంగా 8 వేల స్క్రీన్లపై ఈ చిత్రం ప్రదర్శించనున్నట్లు సమాచారం. మరోవైపు విదేశాల్లో కూడా మరో వెయ్యికి పైగా థియేటర్లలో బాహుబలి2 సినిమాను స్క్రీన్ చేయనున్నారు. ఈ సినిమా టికెట్ ధర ఒక్క టికెట్ రూ. 2,400కు అమ్ముడవుతోందంటే మాటలు కాదు. అది కూడా దేశ రాజధాని ఢిల్లీలోని పీవీఆర్ థియేటర్‌లో. ఇక్కడ ఒక్క టికెట్ ధర రూ. 2,400గా ఉంది.

ఇక ఇటు తెలంగాణలోనూ, అటు ఏపీలోనూ అదనపు షోలకు అనుమతివ్వడంతో.. బ్లాక్ మార్కెట్ టికెట్ల వ్యాపారం కూడా జోరుగా జరగనుందని అంచనా. మరోవైపు టికెట్ల ధరలకు బెంబేలెత్తుతున్న ప్రేక్షకులు పైరసీని ఆశ్రయించే ప్రమాదం కూడా పొంచి ఉంది. మరి దీన్నుంచి ఎలా బయటపడతారో చూడాలి. ఇప్పటికే లీకులతో వార్తల్లో నిలుస్తున్న బాహుబలి ఎలాంటి రికార్డులు సృష్టించనుందో.