బాహుబలి టీమ్ తో మరోసారి!

bahubali technical team to work for charan ntr multistarrer
Highlights

దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే

దర్శకధీరుడు రాజమౌళి త్వరలోనే మల్టీస్టారర్ సినిమాను రూపొందించనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ సిద్ధమైంది ప్రస్తుతం స్క్రీన్ ప్లే వర్క్ జరుగుతోంది. దసరా తరువాత నుండి ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. ఈ సినిమాకు సాంకేతిక నిపుణులుగా బాహుబలి సినిమాను పని చేసిన వారినే రాజమౌళి ఎన్నుకున్నాడు. కీరవాణి సంగీతం అందిస్తుండగా, సెంథిల్ కెమెరా వర్క్ చేయనున్నారు.

ఆర్ట్ వర్క్ కు సాబు సిరిల్ ను మళ్లీ రిపీట్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం రాజమౌళి హైదరాబాద్ నగర శివార్లలో ఉండే అల్యూమినియం ఫ్యాక్టరీను రెండేళ్ల పాటు లీజ్ కు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ స్థలంలో ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ ఓ భారీ సెట్ ను నిర్మించనున్నట్లు సమాచారం. సినిమా షూటింగ్ సగానికి పైగా ఈ సెట్ లోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనికి సంబంధించిన పనులను ముమ్మరం చేస్తున్నారు.

సాధారణంగా అల్యూమినియం ఫ్యాక్టరీలో యాక్షన్ సీక్వెన్సెస్ ను ఎక్కువగా చిత్రీకరిస్తుంటారు. అలాంటిది రాజమౌళి తన సినిమా ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో సీజీ వర్క్ కు కూడా పెద్ద పీట వేశారని తెలుస్తోంది. 

loader