బాహుబలి చిత్రంతో దేశవ్యాప్తంగా రికార్డులు తిరగరాయాలని టార్గెట్ ఇప్పటి వరకు దేశంలో టాప్ వసూళ్లు సాధించిన మూవీగా పీకే ఆమీర్ ఖాన్ పీకే రికార్డులు పీకేస్తామని బాహుబలి టీమ్ ధీమా

తెలుగు సినిమా స్థాయిని హాలీవుడ్ రేంజ్ కి పెంచిందా... అన్నంత ఇమేజ్ సంపాదించుకున్న చిత్రం బాహుబలి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ దృశ్య కావ్యం రెండో భాగం ఈనెల 28న విడుదల కానుంది. ఈ చిత్రం ఇప్పటికే కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టించినా అది టాలీవుడ్ కే పరిమితమైంది. అయితే బాహుబలి2 చిత్రాన్ని తెలుగులోనేకాక హిందీ, తమిళ, మళయాల భాషల్లో రిలీజ్ చేస్తున్నందున కలెక్షన్స్ రికార్డు స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. అయితే దేశవ్యాప్తంగా అత్యదిక కలెక్షన్లు సాధించిన బాలీవుడ్ చిత్రం ఆమీర్ ఖాన్ పీకే ఇప్పటి వరకు అత్యధిక గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇప్పుడు బాహుబలి ఈ రికార్డును క్రాస్ చేయాలనే టార్గెట్ తో వస్తోంది.

ఇప్పటికే 'బాహుబలి 2' ప్రీ రిలీజ్ బిజినెస్సే 500కోట్ల స్థాయిలో జరిగినట్టు భోగట్టా. మొదటి భాగం కంటే ఎక్కువగా బాహుబలి2 చిత్రానికి బిజినెస్‌ జరగడానికి కారణం హిందీ, తమిళం నుంచి పెరిగిన అశేష ఆదరణే. ఆ రెండు భాషల నుంచి మొదటి వెర్షన్‌కి జరిగిన దానికి రెట్టింపు బిజినెస్‌ జరిగింది.



తెలుగు, తమిళం, హిందీ, మలయాళంలో రిలీజ్‌ అవుతోన్న బాహుబలి2 భారతీయ చలన చిత్ర చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని అందుకుంటుందనే అంచనాలున్నాయి. ఈ చిత్రానికి అమీర్‌ఖాన్‌ నటించిన పీకే చిత్రాన్నే బెంచ్‌మార్క్‌గా పెట్టుకున్నారట. ఆ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా ఏడు వందల తొంభై రెండు కోట్ల గ్రాస్‌ వసూలయింది. ఇదే భారత సినిమా పరంగా అతి పెద్ద రికార్డు. అయితే ఇది కేవలం ఒక్క భాషలోనే రిలీజ్‌ అయి సాధించిన రికార్డు.



బాహుబలి నాలుగు భాషల్లో రిలీజ్‌ అవుతోంది కనుక మొత్తంగా కలిపి వెయ్యి కోట్ల గ్రాస్‌ తక్కువ రాదని భావిస్తున్నారు. పీకే ఏయే దేశాల్లో విడుదలైందో అన్ని చోట్ల దీనిని విడుదల చేయాలని, హాలీవుడ్‌, చైనీస్‌ చిత్రాల మాదిరిగా అన్ని దేశాల్లో విడుదల చేసి బాహుబలి బ్రాండ్‌ని జగద్విదితం చేయాలని చూస్తున్నారట. అయితే వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ కంటే ముందుగా ఇండియన్‌ సినిమాకి మార్కెట్‌ వున్న దేశాల మీదే దృష్టి పెట్టారు. ఆ తర్వాత గ్లోబల్‌ రిలీజ్‌ కూడానట. ఇక రికార్డులే రికార్డులు.