Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి2 లేటెస్ట్ ట్రైలర్ చూశారా..వెయ్యి కోట్ల ట్రైలర్

  • వెయ్యి కోట్లు పైగా వసూళ్లు సాధించిన బాహుబలి
  • బాహుబలి చిత్రానికి ప్రపవంచవ్యాప్తంగా విశేష స్పందన
  • ఆకట్టుకుంటున్న భారత దేశ నం.1 బ్లాక్ బస్టర్ చిత్రం కొత్త ట్రైలర్
bahubali new trailer after collecting 1000crores

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పిన బాహుబలి రూ.1000 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టి భారతీయ సినిమాలకు సరికొత్త మైలురాయిగా నిలిచి చరిత్ర సృష్టించిన చిత్రం. ఎస్‌.ఎస్‌. రాజమౌళి వెండితెరపై సృష్టించిన అద్భుత దృశ్య కావ్యం బాహుబలి దికన్ క్లూజన్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.


ఏప్రిల్‌ 28న విడుదలైన ఈ చిత్రం పదిరోజుల్లోనే వెయ్యికోట్లు రాబట్టింది. అమెరికాలో రూ.100 కోట్లు వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగానూ రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌.. నెం.1 బ్లాక్‌బస్టర్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా’ పేరుతో 30 సెకన్ల ఓ వీడియోను విడుదల చేసింది.

 

‘ఒక ప్రాణం.. అంటూ సాగే పాటతో ఈ వీడియో ప్రారంభం కాగా, మధ్య.. మధ్యలో ‘నీకెప్పుడైనా మీ అమ్మను చంపాలనిపించిందా?’ అంటూ బిజ్జలదేవుడి ప్రశ్న.. ‘దేవసేన ఒంటిపై చేయి పడితే బాహుబలి కత్తిపై చేయి పడినట్లే’ అంటూ అమరేంద్ర బాహుబలి డైలాగ్‌, ‘మన నెత్తురే ఓ మహాసేన’ అంటూ మహేంద్ర బాహుబలిగా ఉద్వేగంతో చెప్పే డైలాగ్‌లతో ఈ వీడియో సాగింది.

 

ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, నాజర్‌, సత్యరాజ్‌లు కీలక పాత్రల్లో నటించిన ‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలు కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టి తెలుగోడి సత్తా చాటాయి. అమెరికాలో కూడా టాప్ పొజిషన్ లో నిలిచిన చిత్రంగా బాహుబలి చరిత్ర సృష్టించింది.

Follow Us:
Download App:
  • android
  • ios