ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చిన `బాహుబలి` మూవీ ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. ఈ మూవీకి ఇండియన్ సినిమా లెక్కలను మార్చేసింది. ఈ చిత్రం మరోసారి వెండితెరపై మ్యాజిక్ చేయడానికి రాబోతుంది. తాజాగా ఆ విషయాన్ని ప్రకటించింది టీమ్.
రాజమౌళి భారతీయ సినిమా రూపురేఖలు మార్చేసిన మూవీ `బాహుబలి`. ఈ మూవీకి ముందు తెలుగు సినిమాది ఒక లెక్క, ఈ చిత్రం వచ్చాక తెలుగు సినిమాది మరో లెక్క. అంతగా ఘన విజయం సాధించింది. రాజమౌళి సృష్టికి ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ, సత్యరాజ్ వంటి వారు అందించిన సపోర్ట్, వారి నటన సినిమాకి హైలైట్‌గా నిలిచాయని చెప్పొచ్చు.
500కోట్లు వసూలు చేసిన తొలి తెలుగు మూవీ బాహుబలి
2015లో విడుదలైన ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యింది. ఐదువందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించింది. తెలుగు సినిమాలో అత్యధికవసూళ్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. తెలుగులోనే కాదు అన్ని భాషల్లోనూ పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్ కి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పెద్ద హీరోల సినిమాలన్నీ పాన్ ఇండియాగా రూపొందుతున్న విషయం తెలిసిందే.
అక్టోబర్‌లో బాహుబలి రీ రిలీజ్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిత్రం మళ్లీ రీ రిలీజ్ కాబోతుంది. తాజాగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. సోమవారంతో(ఏప్రిల్ 28) `బాహుబలి 2` విడుదలై ఎనిమిదేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా మొదటి పార్ట్ రీ రిలీజ్ డేట్‌ని ప్రకటించింది. అక్టోబర్‌లో ఈ మూవీని మళ్లీ రిలీజ్ చేయబోతున్నట్టు వెల్లడించారు. అక్టోబర్‌లో రిలీజ్‌కి సంబంధించి ఇప్పుడు ప్రకటించడమే ఆశ్చర్యంగా ఉంది.
ప్రభాస్ పుట్టిన రోజున బాహుబలి రీ రిలీజ్?
అయితే `బాహుబలి` మొదటి పార్ట్ జులై 10న విడుదలైంది. కానీ ఆ డేట్‌ని రీ రిలీజ్ కాకుండా అక్టోబర్‌లో విడుదల చేయడమే ఆశ్చర్యంగా ఉంది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్‌లో ఈ మూవీని విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి మాహిష్మతి సామ్రాజ్యాన్ని, మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిలను మరోసారి స్క్రీన్‌పై చూడబోతున్నామని చెప్పొచ్చు.
read more: బాహుబలి 2 తారల చదువుల వివరాలు: ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా
also read: `జింఖానా` మూవీ 3 రోజుల తెలుగు కలెక్షన్లు.. టాలీవుడ్ సినిమాలకు పెద్ద ఝలక్
