Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి మరో రికార్డు, ఈసారి మగధీర తర్వాత ఇదే

  • మరో రికార్డు సొంతం చేసుకున్న బాహుబలి
  • బాలీవుడ్ సినిమాలకు దక్కని గౌరవం దక్కించుకున్న బాహుబలి
  • టీవీ టీఆర్పీల్లో రికార్డు సాధించిన బాహుబలి

 

bahubali creates another record

తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన మూవీ బాహుబలి. ఈ మూవీ విశ్వవ్యాప్తంగా అనేక రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన సంగతి తెలిసిందే. విడుద‌లైన ప్ర‌తి చోటా ఈ చిత్రం ఘ‌న‌ విజ‌యం సాధించ‌డంతో పాటు, రికార్డు స్థాయిలో కలెక్షన్స్ సాధించింది.

 

బాలీవుడ్ సినిమాల‌ను త‌ల‌ద‌న్ని అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్ర‌సారమైన అన్ని భాష‌ల్లోనూ అత్య‌ధిక‌ టీఆర్పీలు వ‌చ్చిన చిత్రంగా బాహుబ‌లి-2 స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసింది. అక్టోబ‌ర్ 8న తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో దేశ‌వ్యాప్తంగా వివిధ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మైన ఈ చిత్రం ఆ ఘ‌న‌త సాధించి.. మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటో చాటి చెప్పింది. ఈ విష‌యాన్ని "బ్రాడ్‌కాస్ట్ ఆడియ‌న్స్ రీసెర్చ్ కౌన్సిల్ ఇండియా (బార్క్ ఇండియా)" అధికారికంగా వెల్ల‌డించింది.

 

అక్టోబ‌ర్ 7 నుంచి 13 వ‌రకు హిందీలో ప్రసార‌మైన సినిమా ల్లో అత్య‌ధిక ఇంప్రెష‌న్స్ సాధించిన‌ టాప్ 5 చిత్రాలను బార్క్ ఇండియా ప్ర‌క‌టించింది. సోనీమ్యాక్స్ టి.వి చానల్ లో ప్రసార‌మైన "బాహుబ‌లి-ది కన్ క్లూజ‌న్‌" సినిమా 26054 ఇంప్రెష‌న్స్ తో అగ్రస్థానంలో నిలిచింది. అర్బ‌న్ ప్రాంతాల్లోనూ 17671 ఇంప్రెష‌న్స్ తో మొద‌టి స్థానాన్ని సొంతం చేసుకుంది. టెలివిజ‌న్ చ‌రిత్ర‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఏ సినిమా సాధించలేని రికార్డును బాహుబ‌లి-2 సాధించింద‌ని సినీ విశ్లేష‌కులు చెబుతున్నారు. బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ న‌టించిన "ట్యూబ్‌లైట్‌" చిత్రం కూడా 5195 ఇంప్రెష‌న్స్ మాత్ర‌మే ద‌క్కించుకోవ‌డం విశేషం.

 

టెలివిజ‌న్ చరిత్ర‌లో అత్య‌ధిక "టీఆర్పీ రేటింగ్స్" సాధించిన టాప్ 10 చిత్రాల‌లో మొద‌టి స్థానంలో మ‌గ‌ధీర (22), రెండో స్థానంలో బాహుబ‌లి (21.84), మూడో స్థానంలో ఫిదా (21.30) చిత్రం నిలిచాయి.

Follow Us:
Download App:
  • android
  • ios