Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి కలెక్షన్స్ సునామీ.. మెగాస్టార్ కే సాధ్యం కాలేదు..

  • ప్రపంచమంతా కాసుల వర్షం కురిపిస్తున్న బాహుబలి-ది కన్ క్లూజన్
  • అమెరికాలో బాహుబలి2 ప్రీ రిలీజ్ బుకింగ్స్ రికార్డు
  • చిరంజీవి ఖైదీ నెంంబర్ 150 మొత్తం కలెక్షన్స్ ఒక్క రోజులో క్రాస్
  • తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ 180 కోట్ల వరకు

 

bahubali collections tsunami crossed megastar khaidi in oneday

గతరెండేళ్ళు గా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ వాంటెడ్ సినిమా బాహుబలి ఇప్పుడు దేశమంతా మారు మోగిపోతోంది. ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లోనే ఏ సినిమా విషయం లో జరగనంత చర్చ ఈ సినిమా పై జరుగుతోంది. ఇంత సెన్సేషన్ క్రియేట్ అవుతుందని తెలుసు గనకే ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని టార్గెట్ 1000 కోట్ల మీద రాజమౌళి కన్నేశాడు. అంచనాలకు తగ్గట్టుగానే బాహుబలి ఇప్పుడు కలెక్షన్ల సుమానీ సృష్టిస్తోంది.

 

బాహుబలి-2: ద కన్ క్లూజన్' ఒక్క తెలుగు వెర్షన్ కే(ఏపీ,తెలంగాణ) 175 కోట్ల రూపాయలు వసూలైనట్టు తెలుస్తోంది. ఇక సినిమా శాటిలైట్ హక్కులను రెండు పార్ట్ లూ కలిపి 28 కోట్ల రూపాయలకు ‘స్టార్‌ మా' టీవీ కి అమ్మేశారు. ఈ లెక్కన రెండో భాగానికి 14 కోట్ల రూపాయలు దక్కింది. ఇక మలయాళం హక్కులను 8 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్యలో అమ్మగా, తమిళ, హిందీ వెర్షన్‌ లను కూడా భారీ ఎత్తున అమ్మినట్టు తెలుస్తోంది. ఇలా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసిన బాహుబలి ఇప్పుడు కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

 

ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150' ఓవరాల్ కలెక్షన్లను ప్రీ బుకింగ్స్‌తోనే బాహుబలి-2 కొల్లగొట్టింది. అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసింది. అయితే బాహుబలి-2 సినిమా అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ద్వారానే ఏకంగా 3 మిలియన్ డాలర్లను (దాదాపు 19 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసిందని అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. అమెరికాలో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయనీ తెలిపారు. గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అమెరికాలో బాహుబలి-2 విడుదల అవుతుండటంతో ఈ కలెక్షన్లు మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది. ప్రతి గంటకూ లక్ష డాలర్ల దాకా వసూళ్లు జమ అవుతున్నట్లుగా గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ సంస్థే పేర్కొంది.

 

ఈ లెక్కన చూస్తుంటే ప్రిమియర్లతోనే బాహుబలి-2 నాలుగు-ఐదు మిలియన్ డాలర్ల మధ్య వసూలు చేసేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికే 10 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదు. అమెరికా, కెనడాల్లో కలిపి బాహుబలి-2 దాదాపు 1100 స్క్రీన్లలో రిలీజవుతుండటం ఒకటైతే,, ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రిమియర్స్ టికెట్ ధర దాదాపు 40 డాలర్లు పలుకుతుండటం విశేషం. అయినా ఈ చిత్రంపై పెట్టిన భారీ పెట్టుబడి దృష్ట్యా కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప బయ్యర్ సేఫ్ జోన్లోకి రావడం కష్టం. అయితే ప్రస్తుతం కనిపిస్తున్న హైప్ చూస్తుంటే ఆ వసూళ్లను అందుకోవడం అంత కష్టమేమీ కాదని అర్థమవుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios